ఈ విధంగా అందరూ కలిసి కూర్చుని మాట్లాడుతుంటే పిల్లలని వెళ్లి పడుకోండి అని చెప్పగా సౌర్య మనందరం కలిసి ఎక్కడికైనా వెళ్దాం అన్నారు కదా డాడీ.. వెళ్దామా అని అడుగుతుంది.. అందుకు దీప ఉదయం మాట్లాడదాము.. వెళ్లి పడుకో అనగా కార్తీక్ వెళ్ళిపోదాం అంటాడు. అదేంటి అని దీప అడగగా అవును అమెరికా వెళ్ళిపోదాం… అనగా అంటే మోనితకి భయపడుతున్నారా అని దీప అడగడంతో భయం కాదు అసహ్యం చిరాకు అంటూ కార్తీక్ అనగా అంతలో సౌందర్య వచ్చే ఎక్కడికి వెళ్తారు అంటే అమెరికా వెళ్ళి పోతా మమ్మీ అంటూ సమాధానం చెబుతాడు.
ఇక దీప మోనిత ఏడుస్తూ తన కడుపులో బిడ్డ అన్యాయంగా చనిపోతుంది అంటూ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుని ఆ విషయాలని వారితో చెబుతుంది. ఆ మాటలు విన్న కార్తిక్ షట్ అప్ దీప అంటూ ఆగ్రహంతో పైకి లేచి ఇంత చేసి ఎవరికీ పరువు మర్యాదలు లేకుండా చేసింది కనీసం మనశ్శాంతి కూడా లేకుండా చేసిన దానిపై నీకెందుకంత జాలి. ఈ ప్రపంచంలో నువ్వే పుణ్యస్త్రీ అని అనుకుంటున్నావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అప్పుడు సౌందర్య ఏంట్రా ఈ ఆవేశం అని సర్ది చెప్పే ప్రయత్నం చేయగా ఇది ఆవేశమే కేవలం అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.
ఇక మోనిత జైల్లో రత్న సీతతో కలిసి భారీ ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోని రత్నం సీత రెండు చేతులు జోడించి మీకు దండం పెడతా నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అడగగా తనకు సర్దిచెప్పి ఈ పని చేసి పెట్టు అంటూ ఏదో ప్లాన్ చెబుతుంది. కట్ చేస్తే దీపా తులసికోటకు పూజ చేస్తూ తన ఇంటిపై ఏ విధమైనటువంటి చెడు దృష్టి పడకూడదని నమస్కరిస్తున్న సమయంలో రత్న సీత సివిల్ డ్రెస్ లో దీప ఎదురుగా నిలబడుతుంది.డాక్టర్ సార్ ను కలిసి వెళదామని వచ్చాను అని చెప్పడంతో నీకు మేము చాలా రుణపడి ఉంటాం.. మా ఆయన జైల్లో ఉన్నప్పుడు తనకు ఎంతో సహాయం చేసావు అంటూ తనని లోపలికి తీసుకువెళ్తుంది.
ఇక జైల్లో మోనిత ఎలాగైనా కార్తీక్ ను నా సొంతం చేసుకోవాలి. ఇంత అందం, ఐశ్వర్యం ఉన్న నన్ను కాదని ఆ వంటలక్క వెంటపడుతున్నాడు కార్తీక్..కార్తీక్ ఎలాగైనా నాకు కావాలి నా.. కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అయినా కార్తీక్ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తుంది. ఇక దీప ఇంటిలోకి వెళ్ళిన రత్నసీత టీ తాగుతూ ఎవరూ లేని సమయంలో అక్కడే దీప ఫోన్ ఉంటే దానిని తీసుకొని మోనిత అంజిని బెదిరిస్తున్న వీడియోని డిలీట్ చేస్తుంది. అంతలోనే అక్కడికి సౌందర్య ఆనంద్ రావు వచ్చి రత్న సీతతో మాట్లాడుతూ ఉండగా కార్తీక అక్కడికి వచ్చి ఏదో బ్యాక్ తీసుకొచ్చినట్లు ఉన్నావు అని అనడంతో నేను తీసుకు రాలేదు నేను ఇటువైపు వస్తున్నానని మోనిత మీకు ఇవ్వమని ఇచ్చిందని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. మరి అందులో ఏముంది అనే విషయం తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి