‘Love stry’ Trailer వివాదం: సున్నితమైన ప్రేమకథా చిత్రాలు, స్నేహాలు, కుటుంబ విలువలపై సినిమాలు తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల(Shekar Khammula). అలాంటి సెన్సబుల్ డైరెక్టర్ ఎక్కువగా తెలంగాణ మాండలికం, సంస్కృతులు, సంప్రదాయాల గురించే సినిమాలు తీస్తుంటారు. తన హీరో హీరోయిన్లను తెలంగాణ భాషలో మాట్లాడించి ఫిదా చేస్తుంటారు.
ఇటీవల వచ్చిన ‘ఫిదా’ మూవీలో హీరోయిన్ సాయిపల్లవి(sai pallavi)ని తెలంగాణలో యాసలో మాట్లాడించి అలరించాడు. తాజాగా ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ లోనూ హీరో అక్కినేని నాగచైతన్య(Naga chaitanya) తో తెలంగాణ యాసభాష పలికించాడు.
ఇటీవలే ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదలై అందరి మనసులు గెలుచుకుంది. హాట్ టచ్చింగ్ ట్రైలర్ గా ప్రశంసలు అందుకుంది. ఇద్దరు యువతీ యువకులు ఉద్యోగాలు రాక డ్యాన్సర్లుగా మారిన పరిస్థితిని శేఖర్ కమ్ముల కళ్లకు కట్టాడు. నిరుద్యోగ యువత కష్టాలు కన్నీళ్లను హృద్యంగా చూపించాడు. సెప్టెంబర్ 24న విడుదలయ్యే ఈ మూవీ పై బోలెడు అంచనాలున్నాయి.
అయితే ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ లో కొన్ని సంభాషణలపై వివాదం రాజుకుంది. ట్రైలర్ లో శేఖర్ కమ్ముల పేల్చిన డైలాగులు సీఎం కేసీఆర్ గురించేనన్న చర్చ మొదలైంది. ట్రైలర్ లో నాగచైతన్య మాట్లాడుతూ ఓ డైలాగ్ పేల్చుతాడు. ‘రిక్షావోడికి కొత్త రిక్షా ఇస్తే రిక్షానే తొక్కుతాడు.. గొర్లోడికి గొర్రెలు ఇస్తే గొర్లే మేపుతాడు.. ఇంకేం డెవలప్ ఐతారు సార్’ అనే డైలాగ్ వైరల్ అయ్యింది. ఈ డైలాగ్ సీఎం కేసీఆర్ పథకం గురించేనని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ సినిమా చూస్తే కానీ ఇందులో అసలు వివాదం ఉందా? లేదా? అసలు అలా ఎందుకు అన్నాడన్నది తేలనుంది.