Karthika Deepam 2: రెండు తెలుగు రాష్ట్రాలలోనూ టీవీ సీరియల్స్ లో ఫాలో అయ్యే బుల్లితెర ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. టీవీ సీరియల్స్ కు సంబంధించి 51 వ టిఆర్పి రేటింగ్స్ లో స్టార్ మా చానల్లో ప్రసారం అయ్యే కార్తీకదీపం 2 సీరియల్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగానే ఈవారం కూడా కార్తీకదీపం 2 సీరియల్ పిఆర్పి రేటింగ్ లో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ను దాటే సీరియల్ మరొకటి లేదు. ఈ సీరియల్ కి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్న మరొక సీరియల్ ఏంటంటే కొత్తగా ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్. ఏ ఏ సీరియల్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. స్టార్ మా: 51 వ వారంలో కార్తీకదీపం 2 సీరియల్ 9.70 టిఆర్పి రేటింగ్ తో మొదటి స్థానంలో ఉంది. ఇక కొత్తగా ప్రారంభమైన ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 9.01 టి ఆర్ పి రేటింగ్ తో రెండవ స్థానంలో నిలిచింది. గుండెనిండా గుడిగంటలు సీరియల్ 8.91 టిఆర్పి రేటింగ్ తో మూడవ స్థానంలో ఉంది. ఇక ఇదివరకు మంచి టిఆర్పి రేటింగ్ తో ఉన్న బ్రహ్మముడి సీరియల్ టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయిందని తెలుస్తుంది. ఆ సీరియల్ టైమింగ్ మారడం కూడా ఈ సీరియల్ రేటింగ్ పై ప్రభావం చూపుతుందని తెలుస్తుంది. ఇక స్టార్ మా లో నువ్వుంటే నా జతగా అనే సీరియల్ ప్రారంభమై వారం రోజులు మాత్రమే అయినా కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది.
జీ తెలుగు: జీ తెలుగు ఛానల్ సీరియల్స్ స్టార్ మా లో ప్రసారమయ్యే సీరియల్స్ కు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నాయని చెప్పచ్చు. మేఘసందేశం అని సీరియల్ 8.45 టిఆర్పి రేటింగ్ తో జీ తెలుగులో టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పడమటి రాగం సీరియల్ 7.98 టిఆర్పి రేటింగ్ తో అలాగే నిండు నూరేళ్ల సావాసం సీరియల్ 7.65 టిఆర్పి రేటింగ్ తో ఉన్నాయి.
ఈటీవీ : ఈ చానల్లో పిఆర్పి రేటింగ్ మూడు దాటిన సీరియల్స్ ఒకటి కూడా లేవు. ఈ ఛానల్ కు లాయల్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ప్రతిరోజు రాత్రి ఈ ఛానల్ లో ప్రసారమయ్యే న్యూస్ బులిటెన్ టిఆర్పి విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సీరియల్స్ పరంగా ఈ ఛానల్ ఎక్కువ టిఆర్పీలు రాబట్టుకోవడంలో ఫెయిల్ అవుతుంది. ఈ ఛానల్ లో ఈ వారం రంగులరాట్నం సీరియల్ కు 2.34 హైయెస్ట్ రేటింగ్ వచ్చింది. ఇక ఆ తర్వాత మనసంతా నువ్వే సీరియల్ కు 2.01 టీ ఆర్ పి రేటింగ్ వచ్చింది.
జెమినీ టీవీ: ఈ చానల్లో సీరియల్స్ మరింత దారుణమైన టిఆర్పి రేటింగ్ను పొందాయి. భైరవి అనే సీరియల్ మాత్రమే సింగిల్ డిజిట్ దాటిన సీరియల్ గా నిలిచింది. భైరవి సీరియల్ కు1.38 టీఆర్పీ రేటింగ్ దక్కింది.