AP Government: ఏపీలో కూటమి( TDP Alliance) సర్కార్ దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మరోవైపు సంక్షేమ పథకాల( welfare schemes) అమలుపై దృష్టి పెట్టింది. పాలన విషయంలో సైతం వినూత్న నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ ఆనవాళ్లు లేకుండా ఓ పథకాన్ని మార్చేసింది. కేంద్ర ప్రభుత్వ సాయంతో నడుస్తున్న ఓ పథకానికి గతంలో జగన్ పెట్టుకున్న పేరును మార్చేసింది. వైసిపి ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం( Pradhanmantri Aawas Yojana scheme ) కింద మంజూరైన ఇళ్లను.. ఇంటి స్థలాలు ఇచ్చిన పేదలకు వర్తింపజేసింది. భారీగా లేఅవుట్లు వేసింది. వాటికి జగనన్న కాలనీలుగా పేరు పెట్టింది. అయితే నివాసయోగ్యం కానీ ప్రాంతాల్లో కాలనీలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇప్పుడు వాటిని నిర్మించే బాధ్యత తీసుకుంది కూటమి ప్రభుత్వం. అందుకే జగనన్న కాలనీల పేరును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి జగనన్న కాలనీలను పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్ గా మారుస్తూ కూటమి సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
* జగనన్న కాలనీల పేరు మార్పు
రాష్ట్రవ్యాప్తంగా వేలాది లేఅవుట్లలో జగనన్న కాలనీలు( Jagan Anna Colony) ఏర్పాటు చేశారు. ఇకనుంచి వాటిని పీఎంఏవై – ఎన్టీఆర్ నగర్ గా పిలవనున్నారు. ఇప్పటికే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తో పాటు వైయస్సార్ పేరిట ఉన్న పథకాలన్నీ మార్పు చేసింది. ఇప్పుడు గృహ నిర్మాణ పథకాన్ని కూడా పూర్తిగా పేరు మార్చేసింది. 2019లో నవరత్నాల్లో భాగంగా గృహ నిర్మాణానికి జగన్ ప్రాధాన్యమిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు సెంటు భూమి చొప్పున భారీగా లేఅవుట్లను ఏర్పాటు చేశారు. వాటికి జగనన్న కాలనీలుగా పేరు మార్చారు.
* ఆసక్తి చూపని లబ్ధిదారులు
అయితే వైసిపి( YSR Congress ) హయాంలో ఏర్పాటైన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఊరికి దూరంగా, కొండల సమీపంలో, నివాస యోగ్యత లేని ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇల్లు కట్టేందుకు సైతం ఆసక్తి కనబరచలేదు. అధికారులు ఒత్తిడి చేసిన ముందుకు రాలేదు. పైగా ముందు టిడిపి ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కూడా వైసిపి తగ్గించింది. అప్పట్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి టిడిపి ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు ఇచ్చింది. దానిని జగన్ సర్కార్ రూ.1,80,000 తగ్గించింది. అంత మొత్తంతో ఇల్లు కట్టలేమని చాలామంది లబ్ధిదారులు భావించారు. పైగా సెంటు స్థలంలో ఇల్లు ఎలా కట్టుకుంటామంటూ ఎక్కువమంది ఆసక్తి చూపలేదు. ఫలితంగా జగనన్న కాలనీలో గృహ నిర్మాణం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఇప్పుడు వాటిని పూర్తి చేసే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. అందుకే పేరు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు కూడా జారీచేసింది.
* పేదలందరికీ ఇళ్లు
మరోవైపు రాష్ట్రంలో( State wise) పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఎంతవరకు ఇంటి స్థలం కానీ.. ఇల్లు కాని మంజూరు కానీ లబ్ధిదారుల వివరాలను సేకరిస్తోంది. వారి నుంచి దరఖాస్తులు సేకరణ చేపడుతోంది. ఆరు దశల్లో వడబోసి అర్హులైతే మార్చి నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వనుంది. రెండున్నర లక్షల రూపాయలు మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ₹1,50,000, రాష్ట్ర ప్రభుత్వ వాటా లక్ష రూపాయలు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరుగుతోంది. అర్హత ఎంత మంది సాధిస్తే అంత మందికి ఇల్లు మంజూరయ్యే అవకాశం ఉంది.