Karthi On WWE: తమిళ స్టార్ కార్తీ హైదరాబాద్ లో తాజాగా డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్, యాక్టర్ జాన్ సెనాను కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో వైరల్ గా మారింది. కోలీవుడ్ స్టార్ కార్తీ తెలుగు ప్రేక్షకులకు ఎంతోగానో పరిచయం. సినిమాలతోనే కాకుండా ఆయన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరగానే ఉంటారు. ఇంట్రెస్టింగ్ పోస్టులతో ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో కార్తీ తాజా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అందుకు కారణం డబ్ల్యూ డబ్ల్యూ ఈ వరల్డ్ ఛాంపియన్ జాన్ సెనాతో ఉన్న ఫొటోను పంచుకోవడమే. ఇందులో జాన్ తెల్లటి టీ–షర్టు మరియు నలుపు టోపీని ధరించగా, కార్తీ నల్లటి టీ–షర్టు మరియు సరిపోలే డబ్ల్యూడబ్ల్యూఈ జెర్సీని ధరించాడు.
హైదరాబాద్‌లో సూపర్ స్పెక్టాకిల్ కోసం..
హైదరాబాద్ వేదికగా జరగనున్న డబ్ల్యూ డబ్ల్యూ ఈ సూపర్‌స్టార్ స్పెక్టాకిల్ 2023 కోసం రెజ్లర్లు నగరానికి వచ్చారు. ప్రమోషనల్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఇతర రెజ్లర్‌లతో పాటు జాన్ సెనా కూడా వచ్చారు. ఈ క్రమంలో కార్తీ జాన్ సెనాను ప్రత్యేకంగా కలిశారు. ఆయనతో ఓ ఫొటో కూడా దిగారు. వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కార్తీ జాన్ సెనాకు షేక్ హ్యాండ్ ఇస్తున్న ఆ ఫొటో నెట్టింట వైరల్ అయ్యింది.
జాన్ సెనా గురించి..
ఫొటో షేర్ చేస్తూ జాన్ సేనా గురించి కార్తీ కొన్ని మాటలు చెప్పారు. క్యాప్ష¯Œ లో రాసుకొచ్చాడు.. ‘మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది జాన్ సేనా. ఎంతో ప్రేమగా, అభిమానంతో ఉన్నందుకు ధన్యవాదాలు. కొద్ది నిమిషాల్లోనూ మీరు ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా భావించగడం అద్భుతంగా ఉంది. మీ లాయల్టీ, రెస్పెక్ట్ అన్నింటినీ ధన్యవాదాలు’ అంటూ పేర్కొన్నారు. ఈ పోస్ట్ తో కార్తీ పేరు నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది. అయితే, జాన్ సేనాతో కలిసి ఉన్న ఫొటోను కార్తీ పంచుకోవడంతో మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. కార్తీ ఇటీవల డబ్ల్యూడబ్ల్యూ టీమ్ సభ్యులు కెవిన్ ఓవెన్స్, సమీ జైన్‌ను కూడా కలిసి ఉంటారని అంటున్నారు. ఓ ప్రాజెక్ట్ పై సీక్రెట్‌గా వర్క్ చేస్తున్నారని టాక్. దీంట్లో ఎంత నిజముందో మున్ముందు తెలియాల్సి ఉంది.
మొదటిసారి ఇండియాకు..
ఇదిలా ఉండగా, జాన్ సెనా 17 సంవత్సరాలలో తన మొదటి భారతదేశ పర్యటనకు వచ్చారు. జాన్ సెనా గత నెలలో ఎలాంటి క్యాప్షన్ లేకుండా తిరంగ చిత్రాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అతని పోస్ట్ చంద్రయాన్–3 ల్యాండింగ్‌తో సమానంగా ఉన్నందున, భారతదేశం యొక్క చారిత్రాత్మక విజయానికి అతను నివాళి అర్పిస్తున్నాడా అని చాలా మంది ఆశ్చర్యపోయారు.
జాన్ చివరిసారిగా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ యొక్క పదవ విడత ఫాస్ట్ X కనిపించాడు. కార్తీ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో మణిరత్నం యొక్క చారిత్రక ఇతిహాసం పొన్నియిన్ సెల్వన్–2లో కనిపించారు.