Maryam Zakaria: డిప్లోమాటిక్ డైరెక్టర్ సుకుమార్ సినిమాలు చాలా ప్లాన్డుగా ఉంటాయి. అంశం చిన్నదే అయినా దానిని చూపించడంలో ఈయన తెగ కష్టపడిపోతుంటారు. ఆయన మదిలో నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో తీసిన ‘పుష్ప’ కు పలు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. సుకుమార్ లవ్ ఎమోషనల్ నేపథ్యంలో తీసిన మూవీ 100%లవ్. నాగచైతన్య, తమన్నా జంటగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగచైతన్య కెరీర్లోనే ఇది సక్సెస్ చిత్రం అని చెప్పొచ్చు. అయితే ఇందులో ఐటమ్ సాంగ్ లో నటించిన అమ్మాయి గుర్తుందా? ఆమె ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
100%లవ్ సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇందులో అన్నీ పాటలు ఆకట్టుకుంటాయి. ఇక ఇందులో ఐటమ్ సాంగ్ ‘డియ్యాలో డియ్యాలో’ అనే సాంగ్ కుర్రకారులో ఊపు తెస్తుంది. ఇప్పటికీ కొన్ని పెళ్లిళ్లలో ఈ సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ లో నటించినామె పేరు మరియం జకారియా. జకారియా మనదేశం అమ్మాయి కాదు. ఇరానియర్ -స్వీడిష్ నటి. తెలుగులో 100%లవ్ సినిమా తరువాత అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ‘మడత కాజా’లో నటించింది. బాలీవుడ్ లో ‘గ్రాండ్ మస్తి’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న జకారియా ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఇన్ స్ట్రాగ్రామ్ లో హాట్ హాట్ ఫొటోలను అప్లోడ్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
స్వీడన్ లో మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఈమె ఆ తరువాత కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. అలాగే స్వీడన్ లో ఇండిస్క్ డాన్స్ స్టూడియోను ప్రారంభించారు. ఇండియన్ సినిమాల్లో నటించాలన్న ఆసక్తితో 2009లో ఇక్కడ అడుగుపెట్టారు. ఆ తరువాత పలు యాడ్స్ లో నటించారు. ఇమ్రాన్ ఖాన్ తో జకారియా కోకోకోలా యాడ్ లో కనిపించింది. ఆ తరువాత తమిళ దర్శకుడు సుందర్ సి తీసిన ‘నగరం’ అనే మూవీలో అవకాశం ఇచ్చాడు.
2011లో వచ్చిన 100%లవ్ లో జకారియా సాంగ్ ఫేమస్ కావడంతో ఆమెకు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగాయి. జకారియా సైతం ఎప్పటికప్పుడు తన ఫొటోలను అప్డేట్ చేస్తూ ఉంటోంది. తాజాగా ఆమెకు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే జకారియా మళ్లీ సినిమాల్లోకి వస్తుందా? అనికొందరు చర్చలు పెడుతున్నారు.