https://oktelugu.com/

హీరోగారి కొడుకు పేరు ‘కందన్’ !

స్టార్ హీరో కార్తి -రంజని దంపతులకు గతేడాది అక్టోబర్‌ లో అబ్బాయి పుట్టాడు. అయితే ఇప్పటివరకూ కార్తి తన వారసుడికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అండ్ ఫోటోలను కానీ, ఇతర విషయాలను కానీ ఫ్యాన్స్ కోసం కూడా బయటపెట్టలేదు. కనీసం పేరును అయినా మాకు చెప్పండి అంటూ ఫ్యాన్స్ చాల కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళ డిమాండ్ ను అర్ధం చేసుకున్న కార్తి, మొత్తానికి తన వారసుడి పేరును బయట పెట్టాడు. ఈ సందర్భంగా […]

Written By:
  • admin
  • , Updated On : March 18, 2021 / 07:08 PM IST
    Follow us on


    స్టార్ హీరో కార్తి -రంజని దంపతులకు గతేడాది అక్టోబర్‌ లో అబ్బాయి పుట్టాడు. అయితే ఇప్పటివరకూ కార్తి తన వారసుడికి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ అండ్ ఫోటోలను కానీ, ఇతర విషయాలను కానీ ఫ్యాన్స్ కోసం కూడా బయటపెట్టలేదు. కనీసం పేరును అయినా మాకు చెప్పండి అంటూ ఫ్యాన్స్ చాల కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళ డిమాండ్ ను అర్ధం చేసుకున్న కార్తి, మొత్తానికి తన వారసుడి పేరును బయట పెట్టాడు.

    ఈ సందర్భంగా తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ అకౌంట్ ‌లో కార్తి తన కొడుకుని ఉద్దేశించి పోస్ట్ చేస్తూ.. ‘నేను, మీ అమ్మ, నీ సోదరి ఎంతో ప్రేమతో నీకు ‘కందన్’ అనే అందమైన పేరును పెట్టాము. నీ రాకతో మా జీవితాలు మరింత అందంగా మారిపోయాయి అని కార్తి పోస్ట్ చేశాడు. కార్తి మెసేజ్ చూస్తే.. తన వారసుడి రాకతో తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని కార్తి ఫీల్ అవుతున్నట్టు అర్ధం అవుతుంది. ఇక కార్తి తన కొడుకు పేరును అనౌన్స్ చేసిన వెంటనే తమిళ్ సినీ ప్రముఖులతో పాటు కార్తి అభిమానులు కూడా తమ విషెష్ ను తెలియజేస్తున్నారు.

    అభిమానుల నుండి అభినందనలు వెళ్లువెత్తడంతో కార్తి కుటుంబం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక, 2011లో కార్తీ, రంజనీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2013లో వాళ్లకు ఓ ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ఉమయాళ్‌ అని పేరు పెట్టారు. ఇప్పుడు కొడుక్కి కందన్ అని పేరు పెట్టాడు. ఏది ఏమైనా తమ హీరో వారసుడికి ఏం పేరు పెట్టారు? ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు? అంటూ అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారి ఆసక్తి మొత్తానికి నేటితో తీరింది.