https://oktelugu.com/

న్యాయం కోసం స్టేషన్ లో ‘నటి’ !

‘నటి కరాటే కల్యాణి’.. తెలుగు సినిమాల ప్రస్తుత బోల్డ్ క్యారెక్టర్లకు ఆమె పెట్టింది పేరు. మొదట్లో ఐటమ్ ఆంటీల పాత్రల్లో దుమ్ము దులుపిన ‘కరాటే కల్యాణి’.. బిగ్ బాస్ లో కూడా బాగానే హల్ చల్ చేసింది. అయితే, ఈ మధ్య ఈ ఆంటీ పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతుంది అనుకోండి. చిన్నాచితకా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈ ఆంటీని పెద్దగా ఎవ్వరూ గుర్తించడం లేదు. మొత్తానికి, అదృష్టం కలిసిరాకపోయినా.. లైమ్ లైట్ […]

Written By:
  • admin
  • , Updated On : March 18, 2021 / 07:02 PM IST
    Follow us on


    ‘నటి కరాటే కల్యాణి’.. తెలుగు సినిమాల ప్రస్తుత బోల్డ్ క్యారెక్టర్లకు ఆమె పెట్టింది పేరు. మొదట్లో ఐటమ్ ఆంటీల పాత్రల్లో దుమ్ము దులుపిన ‘కరాటే కల్యాణి’.. బిగ్ బాస్ లో కూడా బాగానే హల్ చల్ చేసింది. అయితే, ఈ మధ్య ఈ ఆంటీ పెద్దగా అవకాశాలను అందుకోలేకపోతుంది అనుకోండి. చిన్నాచితకా సినిమాల్లో హాట్ హాట్ రోల్స్ ను ట్రై చేసినా ఈ ఆంటీని పెద్దగా ఎవ్వరూ గుర్తించడం లేదు. మొత్తానికి, అదృష్టం కలిసిరాకపోయినా.. లైమ్ లైట్ లో ఉండటానికి బాగానే కష్టపడుతుంది. ఇందులో భాగంగా తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది.

    హరికథ గానంలో ‘కరాటే కల్యాణి’కి ఓ యువతి పరిచయమైందట. అయితే ఆమె ఎవరి చేతిలోనో మోసపోయిందట. దాంతో కళ్యాణికి ఆగ్రహం వచ్చేసింది. వెంటనే ఆ అమ్మాయిని వెంట పెట్టుకుని, పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ఈ అమ్మాయికి న్యాయం చేయాలని, గుంటూరు అర్బన్‌ జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డిని కోరింది. ఈ అమ్మాయి గుంటూరు ఏటీ అగ్రహారం ఎనిమిదో లైన్‌ కు చెందినది, అందుకే ఇక్కడ పోలీసులని ఆశ్రయంచాము అని అంటుంది కళ్యాణి. ఇంతకీ ఆ అమ్మాయిని మోసం చేసింది ఎవరు అంటే..

    అతగాడు కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన యువకుడు అహ్మద్‌ తషీఫ్‌ అట. 2019లో లాడ్జికి తీసుకెళ్లి ఆహారంలో మత్తు మందు కలిపి స్పృహ కోల్పోయిన తరువాత యువతిపై అతడు లైంగిక దాడి చేసి, వీడియోలు కూడా చిత్రీకరించాడట. అనంతరం ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని.. అనంతరం బాధిత యువతి వయోలిన్‌ విద్య నేర్చుకునేందుకు హైదరాబాద్‌ వెళ్లగా, అక్కడకు కూడా తషీఫ్‌ వచ్చి మాయమాటలు చెప్పి ఆర్య సమాజంలో ఆమెను పెళ్లి చేసుకుని మోసం చేశాడని కళ్యాణి తన ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది.