https://oktelugu.com/

డేటింగ్ చేసైనా పిల్లల్ని కంటుందట !

‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది కరాటే కళ్యాణి. దాదాపు 250 సినిమాల్లో నటించినా ఎక్కువుగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయినా కరాటే కళ్యాణిలో చాల కళలే ఉన్నాయ్. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ ఇలా మల్టీటాలెంటెడ్ గా ఉంది కరాటే కళ్యాణి. ఇన్ని ఉన్నా ఆమెకు మాత్రం వ్యాంప్ ఆర్టిస్ట్ అనే బిరుదు మాత్రమే మిగిలిపోయింది. ఇక బిగ్గెస్ట్ […]

Written By:
  • admin
  • , Updated On : September 25, 2020 / 04:33 PM IST
    Follow us on


    ‘బాబీ పిండేశావ్’ అనే సింగిల్ డైలాగ్ తో బాగా పాపులర్ అయింది కరాటే కళ్యాణి. దాదాపు 250 సినిమాల్లో నటించినా ఎక్కువుగా వ్యాంప్ పాత్రలకే పరిమితం అయినా కరాటే కళ్యాణిలో చాల కళలే ఉన్నాయ్. ఆమెలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ తో పాటు డాన్సర్ కమ్ సింగర్ కమ్ కరాటే కమ్ హరికథ ఇలా మల్టీటాలెంటెడ్ గా ఉంది కరాటే కళ్యాణి. ఇన్ని ఉన్నా ఆమెకు మాత్రం వ్యాంప్ ఆర్టిస్ట్ అనే బిరుదు మాత్రమే మిగిలిపోయింది. ఇక బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4లో 12వ కంటెస్టెంట్‌ గా వెళ్లిన కరాటే కళ్యాణి, తన ముక్కుసూటి మనస్తత్వంతో రెండో వారంలోనే ఎలిమినేట్ అయి ఇంటి ముఖం పట్టింది. అయితే బిగ్ బాస్ హౌస్‌ లో రెండు వారాలే ఉన్నా… పది వారాలకు పైగా ఉన్న రేంజ్ లో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది ప్రస్తుతం.

    Also Read: ఎటొచ్చి నలిగిపోయింది రకుల్ ప్రీత్ సింగే !

    అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరాటే కళ్యాణి తాజాగా పెళ్లి, పిల్లలు, డేటింగ్ వంటివాటి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి మొత్తానికి సోషల్ మీడియాకి తన శైలిలో కాస్త కంటెంట్ ను ఇచ్చింది. ఇంతకీ ఈ ఆంటీ ఏమందంటే ‘తానూ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటానేమో.. లేదంటే సహజీవనం చేసైనా పిల్లల్ని కనొచ్చేమో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తనకు మొదట్లో పిల్లల్ని కనేందుకు కొన్ని సమస్యలు వచ్చాయని.. అయితే ఆ తరువాత అలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదని.. ఇప్పుడు తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానని.. పైగా ఇప్పటికే అన్ని టెస్ట్‌ లు చేయించుకున్నానని.. పిల్లల్ని కనే సామర్ధ్యం నాకు ఉందని కళ్యాణి ఆంటీ చెప్పుకొచ్చింది.

    Also Read: ఉన్నట్టు ఉండి ఆ పోస్ట్ ఎందుకు చేసిందో ?

    ఈ వయసులో ఇదేమి కోరిక తల్లా అంటూ నెటిజన్లు కూడా కళ్యాణి కామెంట్స్ కి తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ షోలోకి వెళ్లేముందు కూడా కళ్యాణి ఇదే అంశం గురించి మాట్లాడుతూ.. ‘తనకు సీమంంతం చేసుకోవాలని.. తన గర్భాన్ని తాను చూసుకోవాలనే కోరిక బలంగా ఉందని.. పెళ్లి చేసుకున్న ప్రతీసారి గర్భం రావడం పోవడం జరిగిందని.. కానీ తన కోరిక తీరలేదని చెబుతూ అప్పడు అందర్నీ ఏడిపించిన సంగతి తెలిసందే. అలాగే తానూ తెర పై వేషాలు మాత్రమే అలా బోల్డ్ గా వేస్తానని, నిజ జీవితంలో మాత్రం అలాంటివాటికీ తానూ పూర్తీ వ్యతిరేఖం అని కళ్యాణి  చెప్పుకొచ్చింది.