megastar chiranjeevi
చిరంజీవితో సినిమా చేయాలనేది ప్రతీ దర్శకుడి కల. ఎన్నో ఏళ్లుగా ఆయనతో సినిమా చేయాలని వెయిట్ చేసే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. పాతతరం దర్శకులతోపాటు నేటితరం దర్శకులు కూడా ఒక్క సినిమా అయిన చిరుతో చేయాలని భావిస్తుంటారు. ఇటీవల ఓ కొత్త దర్శకుడికి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ దక్కింది. ఈ సినిమా కోసం కొంత స్క్రీప్ట్ వర్క్ కూడా చేశారు. అయితే ఇటీవలే పెళ్లి చేసుకున్న ఆ దర్శకుడు ఈ మూవీ నుంచి తప్పుకున్నాడనే వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని చిరంజీవి వద్ద ప్రస్తావించగా సదరు దర్శకుడే మూవీ నుంచి తప్పుకున్నాడని.. తాము తప్పించలేదని స్పష్టం చేశారట.
Also Read: బిగ్ బాస్-4లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. హాట్ హీరోయిన్ ఎంట్రీ?
చిరు మూవీ నుంచి ఆ దర్శకుడు ఎందుకు తప్పుకున్నారనేది చర్చనీయంశంగా మారింది. ఇప్పటికే ఆ దర్శకుడెవరు మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా.. అతడేవరో కాదు.. సాహో దర్శకుడు సుజిత్. టాలీవుడ్లో రన్ రాజా రన్ తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన సుజిత్ ఆ తర్వాత ప్రభాస్ తో కలిసి ‘సాహో’ను తెరకెక్కించాడు. ఈ మూవీ హిట్టు తర్వాత రాంచరణ్ తో ఓ మూవీ చేయాలని సుజిత్ భావించాడు. అయితే అనుకోకుండా సుజిత్ కు చిరంజీవిని డైరెక్టర్ చేసే ఛాన్స్ వచ్చింది.
మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘లూసీఫర్’ రీమేక్ ను తెలుగులో సుజిత్ తెరకెక్కించే చాన్స్ దక్కించుకున్నాయి. ఇందుకోసం కొంత స్క్రీప్టు వర్క్ కూడా చేశాడు. ఈక్రమంలో సుజిత్ పెళ్లి జరిగింది. అనంతరం కరోనా ఎఫెక్ట్ తో ఈ మూవీ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సుజిత్ మెగాస్టార్ ను కలిసి చెప్పారట. దీనికి చిరంజీవి కూడా ఓకే అన్నారు. దీంతో ‘లూసీఫర్’ రీమేక్ బాధ్యత దర్శకుడు వినాయక్ చేతికి వెళ్లినట్లు తెలుస్తోంది.
‘సాహో’ పనితనం చూసి సుజిత్ కు ‘లూసిఫర్’ రీమేక్ బాధ్యతలను చిరంజీవి అప్పగించారు. అయితే ‘లూసీఫర్’ కోసం ఆయన స్ర్కీప్ట్ వర్క్ నచ్చకపోవడంతో అతడిని చిరు పక్కకు పెట్టినట్లు టాక్ విన్పిస్తోంది. అయితే చిరు మాత్రం సుజిత్ పెళ్లిని కారణంగా చూపించి తప్పుకున్నారని చెప్పడం నమ్మశక్యం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘లూసీఫర్’ ను మాస్ మాసాలాగా రూపొందించడానికి సుజిత్ సరిపోడని.. వినాయక్ అయితేనే కరెక్ట్ అని చిరు అండ్ కో భావించిదట.
Also Read: డేటింగ్ చేసైనా పిల్లల్ని కంటుందట !
దీంతో ఈ ప్రాజెక్టు వినాయక్ చేతిలోకి వెళ్లింది. చిరు-వినాయక్ కాంబినేషన్లో వచ్చిన మూవీలన్నీ కూడా సూపర్ హిట్టుగా నిలిచాయి. క్రియేటవ్ గా ఆలోచించే దర్శకుడు సుజిత్ రీమేక్ మూవీ చేయకుండా వదులుకోవడం సరైన నిర్ణయమేనని పలువురు ఆయనకు మద్దతు తెలుపుతుండటం గమనార్హం. అయితే సుజిత్ ను తప్పించారా? లేదా తప్పుకున్నాడా అనేది మాత్రం సుజిత్ చెబితేనే క్లారిటీ వచ్చే అవకాశం కన్పిస్తోంది. మరీ సుజిత్ ఈ విషయంపై స్పందిస్తాడో లేదో వేచిచూడాల్సిందే..!