Anil Ravipudi Remuneration: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతోంది… కమర్షియల్ సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడి ని మించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కారణం ఏదైనా కూడా అనిల్ కి ప్రేక్షకుల పల్స్ తెలిసిన దర్శకుడిగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం తన టాలెంట్ ను వాడుకుంటూ ప్రతి ప్రేక్షకుడి చేత శభాష్ అనిపించుకునే సినిమాలు చేస్తున్నాడు. ఇక హీరో ఎవరైనా కూడా వాళ్ళ మేనరిజమ్స్ కి తగ్గట్టుగా కథను రాసుకొని సినిమాని తక్కువ బడ్జెట్ లో చేసి సూపర్ సక్సెస్ ని సాధిస్తున్నాడు.
ఇక రీసెంట్ గా వచ్చిన మన శంకర వరప్రసాద్ సినిమా సైతం చాలా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించాడు. చిరంజీవి, వెంకటేష్, నయనతార, అనిల్ రావిపూడి, సమీర్ రెడ్డి లాంటి స్టార్ టెక్నీషియన్స్ హీరోలు దర్శకుల యొక్క రెమ్యూనరేషన్స్ తీసివేయగా కేవలం 32 కోట్లతో మాత్రమే ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమా మేకింగ్ కోసం ఖర్చయిందట.
ఇక ఏది ఏమైనా కూడా అంత తక్కువ బడ్జెట్లో అంత పెద్ద స్టార్ హీరో సినిమాను తీసి సూపర్ సక్సెస్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు అవసరం ఉన్న లేకపోయిన ప్రొడ్యూసర్స్ తో వందల కోట్లు ఖర్చు పెట్టిస్తున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి మాత్రం ప్రొడ్యూసర్స్ హీరోగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అందువల్లే అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది ప్రొడ్యూసర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇక దిల్ రాజు సైతం అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడు. గత సంవత్సరం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో వచ్చి సూపర్ సక్సెస్ ను సాధించారు.కాబట్టి మరోసారి అనిల్ తో సినిమా చేయడానికి దిల్ రాజు ఆసక్తి చూపిన్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇలాంటి దర్శకుడితో సినిమా చేస్తే ప్రతి ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండచ్చు…