Homeఎంటర్టైన్మెంట్Kantara 2 Collections Day 13: 'కాంతారా 2' ముందు 1200 కోట్ల టార్గెట్..కానీ 13...

Kantara 2 Collections Day 13: ‘కాంతారా 2’ ముందు 1200 కోట్ల టార్గెట్..కానీ 13 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇవే!

Kantara 2 Collections Day 13: ఈమధ్య కాలం లో భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి ఆట నుండే తిరుగులేని పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘కాంతారా : చాప్టర్ 1′(Kantara: The Chapter 1). ఆ టాక్ కి తగ్గట్టే భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, ఓపెనింగ్ వీకెండ్ తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోయాయి అనేది వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పూర్తి స్థాయి లో బ్రేక్ […]

Kantara 2 Collections Day 13: ఈమధ్య కాలం లో భారీ అంచనాల మధ్య విడుదలై మొదటి ఆట నుండే తిరుగులేని పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘కాంతారా : చాప్టర్ 1′(Kantara: The Chapter 1). ఆ టాక్ కి తగ్గట్టే భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, ఓపెనింగ్ వీకెండ్ తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోయాయి అనేది వాస్తవం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా పూర్తి స్థాయి లో బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సిందే. అడ్వాన్స్ బేసిస్ మీద అంత వసూళ్లు రాకపోయినా,కనీసం 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అయితే ఈ చిత్రం రాబట్టాలి. కానీ ఆ పరిస్థితులు ప్రస్తుతానికి అసలు కనిపించడం లేదు. ఇక తెలుగు వెర్షన్ లో అయితే ఈ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని సొంతం చేసుకుంది అనే చెప్పాలి.

మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు వచ్చిన వసూళ్లను పరిశీలిస్తే, అన్ని భాషలకు కలుపుకొని 645 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే కర్ణాటక ప్రాంతం నుండి 175 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల నుండి 94 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత తమిళనాడు నుండి 50 కోట్ల రూపాయిలు, కేరళ నుండి 45 కోట్ల రూపాయిలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 180 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్ నుండి 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద షేర్ ని లెక్కగడితే 316 కోట్ల రూపాయిలు వచ్చిందట.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని 91 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసారట . ఇప్పటి వరకు ఈ చిత్రానికి 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. బ్రేక్ ఈవెన్ మార్కుని దాటాలంటే 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలి. తెలుగు రాష్ట్రాల నుండి 13 వ రోజున ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు 60 లక్షల రూపాయిల షేర్ మాత్రమే. ఇంత తక్కువ షేర్స్ వస్తే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఎన్నేళ్లు పడుతుంది?, కాబట్టి కమర్షియల్ గా ఈ సినిమా అన్ని భాషల్లోనూ డిజాస్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. ఇక దీపావళి కి అన్ని భాషల్లోను సినిమాలు ఉన్నాయి. ఒక్క టాలీవుడ్ నుండే నాలుగు సినిమాలు వస్తాయి. కాబట్టి కాంతారా థియేటర్స్ భారీగా తగ్గిపోతాయి. కాబట్టి ఇక తెలుగు రాష్ట్రాల నుండి రెండు మూడు కోట్ల రూపాయిల షేర్ కి మించి ఊహించలేం. కాబట్టి కమర్షియల్ గా ఒక పెద్ద ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper