Kantara 2 beat Baahubali 2: ఒక సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ముందుగా ఒక మంచి కథ ఉండాలి… ఇక ఆ స్టోరీని ప్రేక్షకుడికి నచ్చే విధంగా తీర్చిదిద్దాలి. కథ బాగున్నంత మాత్రాన సినిమా ఆడదు. విజువల్ గా కూడా ప్రేక్షకుడికి దానిని కనెక్ట్ చేయాలి. అప్పుడు మాత్రమే సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తోంది. మొత్తానికైతే భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలన్నీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ ని సాధించింది. ఆ సినిమా తర్వాత సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా పాన్ ఇండియాలో తమ సత్తా చాటుతూ ఉండడం విశేషం…బాహుబలి 2 సినిమాతో రాజమౌళి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేశాడు.
ఈ సినిమా దాదాపు 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేసింది… గత రెండు సంవత్సరాల క్రితం కన్నడ ఇండస్ట్రీ లో కాంతార సినిమా వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ విజయాన్ని దక్కించుకుంది.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా కాంతార చాప్టర్ వన్ మూవీ వచ్చింది. ఈ సినిమా కూడా పెను ప్రభంజనాన్ని సృష్టించింది. మొత్తానికైతే ఈ సినిమా ప్రస్తుతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తోంది. దాదాపు ఈ సినిమా రిలీజ్ అయి 16 రోజులు పూర్తి అవుతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా 600 కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టింది.
ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ‘బాహుబలి 2’ సినిమా రికార్డును బ్రేక్ చేస్తోందని చాలామంది చెప్పినప్పటికి ఈ సినిమాతో అంత పెద్ద రేంజ్ లో కలెక్షన్స్ రావట్లేదు అంటూ సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మహా అయితే ఇంకొక 100 కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చని వాళ్ళు తెలియజేస్తుండటం విశేషం…