Pakistan split : పాకిస్తాన్.. గత కొద్దిరోజుల్లో గ్లోబల్ పఠంలో ఎక్కువగా వినిపిస్తోంది. గాజా శాంతి ఒప్పందంలో ట్రంప్ పక్కనే నిలబడి పాక్ ప్రధాని పొగిడాడు. ఆ పొగడ్తలు చూస్తే మనం మక్కున వేలేసుకోవాల్సిందే. పాకిస్తాన్ సమాజం కూడా అవాక్కవుతోంది. నిజం చెప్పాలంటే పాక్ సమాజం ప్రభుత్వం, ఆర్మీ పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ప్రపంచ సేల్స్ మెన్స్ లాగా పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ అడుక్కుంటున్నారని పాకిస్తాన్ ప్రజలు సీరియస్ గా ఉంటున్నారు.
అమెరికా, యూరప్ దేశాలు ఇండియాకు వస్తున్నాయంటే అతిపెద్ద మార్కెట్ ఉందని వస్తున్నాయి. పాకిస్తాన్ లో ఏముంది వస్తాయి. రేర్ మినరల్స్ చూపించి అగ్రదేశాలను ఆకర్షిస్తున్నాయి. తవ్వితే కానీ పాక్ లో ఇవి ఉన్నాయని తెలియదు.
కైబర్ ఫంక్తున్వాలో పాక్ సైనికులు చనిపోతున్నారు. అయితే వారి ప్రాణాలను గోప్యంగా ఉంచుతూ వారి ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. పంజాబ్ లోని టీఎల్పీ హెడ్ క్వార్టర్ పై ఆర్మీ దాడి చేసింది. టీఎల్పీ నిరసనలు ఆర్మీ అణిచివేస్తోంది.
పాక్ బద్దలయితే జరిగే పరిణామాల్ని ఎదుర్కోవటానికి ప్రపంచం సిద్ధం కావాలి.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.