Kantara 2 Latest Updates: కన్నడ సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి పాపులారిటి ని సంపాదించుకున్న సినిమా కాంతార ఇక ఆ తర్వాత చూసిన సూపర్ సక్సెస్ ని సాధించింది. మరి ఈ సినిమా అందించిన సక్సెస్ తో సినిమాకి సీక్వెల్ గా ‘కాంతార 2’ కూడా చేస్తున్నారు… ఈ సినిమా దసర కానుకగా అక్టోబర్ 2 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక అందులో భాగంగానే ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ ను కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మొదటి పార్ట్ కి సెకండ్ పార్ట్ కి సంబంధం లేనట్టుగా ఉంది. అయితే విజయాల మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. దానికి కొనసాగింపుగా ఈ సినిమా కథ ఉంటే బాగుండేది. ఇక ఇది ఒక అడవి బ్యాక్ డ్రాప్ లో తీసినప్పటికి అక్కడ ఒక తెగ కి సంబంధించిన కొంతమంది ప్రజలు పడే ఇబ్బందులు…పేద ప్రజలకు రాజులకు మధ్య జరగబోయే ఒక పోరుగా ఈ సినిమాని తీసినట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా మొదటి పార్ట్ లో ఉన్నంత స్పార్క్ అయితే ఈ కథలో లేనట్టుగా తెలుస్తోంది. విజువల్స్ బాగున్నాయి అనిపించినప్పటికి కథపరంగా మాత్రం చాలావరకు ఈ సినిమా డిసప్పాయింట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. నిజానికైతే కాంతార సినిమా కి సీక్వెల్ చేసే అంత స్కోప్ అయితే లేదు.
అయినప్పటికి కావాలనే ఆ సినిమాకి సీక్వెల్ అయిందనే ఉద్దేశ్యంతోనే దానికి సీక్వెల్ గా గ్రాండియర్ తో తెరకెక్కిస్తే సినిమా సక్సెస్ ని సాధించొచ్చు అనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సెకండ్ పార్ట్ లో కథ మీద పెద్దగా ఫోకస్ అయితే చేయడం లేదు. ఒకవేళ అతను మంచి ఫోకస్ చేసి సినిమా తీసినట్లైతే ఈ సినిమా సూపర్ సక్సెస్ ను సాధిస్తుందని చాలామంది చెబుతున్నారు.
మరి మొత్తానికైతే ఈ సినిమాలో ఏదో ఒక స్పెషాలిటి ఉంటే తప్ప ఈ సినిమా మొదటి పార్ట్ నుంచి సక్సెస్ సాధించదు. మరి రిషబ్ శెట్టి ఏ ఉద్దేశ్యంతో ఈ సినిమాని చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ ఈ సినిమా సక్సెస్ సాధిస్తేనే ఆయన మార్కెట్ అయితే భారీగా పెరుగుతోంది. లేకపోతే మాత్రం ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి…