Kantara 2 Collections: భారీ అంచనాల నడుమ రీసెంట్ గానే విడుదలైన ‘కాంతారా : ది చాప్టర్ 1′(Kantara : The Chapter 1) చిత్రం విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శితమవుతోంది. సినిమా విడుదలై 11 రోజులు పూర్తి అయ్యినప్పటికీ కూడా వరల్డ్ వైడ్ వసూళ్లు ఏమాత్రం తగ్గలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం అని అనిపిస్తున్నప్పటికీ, కర్ణాటక రాష్ట్రంలో మాత్రం బ్లాక్ బస్టర్ నుండి ఇండస్ట్రీ హిట్ వైపు అడుగులు వేస్తోంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 11 వ రోజున 55 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో నిన్నటితో ఈ చిత్రం 605 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ల మార్కుని అందుకుంది. అక్టోబర్ 12న దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 16,576 షోస్ ప్రదర్శితం అవ్వగా, 45 కోట్ల 72 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట.
బాషల వారీగా చూస్తే కన్నడ లో 1,957 షోస్ ప్రదర్శితం అవ్వగా, 14 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా హిందీలో 9,330 షోస్ కి గానూ 16 కోట్ల 63 లక్షల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక మన తెలుగు లో ఇండియా వైడ్ గా కలిపి ఈ చిత్రానికి 1,947 షోస్ వేయగా, 5 కోట్ల 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నిన్న టికెట్ రేట్స్ బాగా తగ్గడం తో ప్రధాన నగరాల్లో టికెట్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక తమిళ బాషా విషయానికి వస్తే 2,123 షోస్ కి గానూ ఈ చిత్రం 6 కోట్ల 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, మలయాళం వెర్షన్ నుడి 3 కోట్ల 33 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఓవర్సీస్ కూడా కలిపి ఈ చిత్రానికి 55 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద ఈ చిత్రం 605 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని చేరుకోవడం గొప్ప విషయమే. ఫుల్ రన్ లో 750 కోట్ల గ్రాస్ వరకు రావొచ్చు. అయితే ఇది బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఏ మాత్రం సరిపోదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వరల్డ్ వైడ్ గా అన్ని భాషలకు కలిపి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి, అంటే ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్, ఫుల్ రన్ లో కూడా రావాలి. అది అసాధ్యం కాగా, కమర్షియల్ గా చూస్తే ఈ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అయితే తక్కువలో తక్కువ కనీసం 20 నుండి 30 కోట్ల నష్టాన్ని చూసే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.