Pawan Kalyan Anil Ravipudi Movie: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఫ్యాన్స్ ఓజీ(They Call Him OG) మూవీ సక్సెస్ తో మునుపెన్నడూ లేని జోష్ లో ఉన్నారు. రెండు నెలల క్రితమే వాళ్లంతా ‘హరి హర వీరమల్లు’ లాంటి డిజాస్టర్ సినిమాని కళ్లారా చూసి తీవ్రమైన నిరాశకు గురయ్యారు. కానీ ఇంత తొందరగా ఓజీ లాంటి భారీ బ్లాక్ బస్టర్ తో సంబరాలు చేసుకునే రోజులు వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. సాధారణంగా ఒక సినిమాకు 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలంటే కచ్చితంగా ఇతర భాషల్లో బాగా ఆడాల్సిందే. కానీ ఓజీ చిత్రం మాత్రం కేవలం తెలుగు వెర్షన్ సహాయంతోనే 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను అందుకుంది. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్, నేటి జనరేషన్ యూత్ కి తగ్గ సినిమా తీస్తే ఆయన సత్తా ఎలా ఉంటుందో చెప్పడానికి ఒక నిదాహరణే ఈ సినిమా.
ఇక ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ నుండి విడుదల అవ్వబోయే చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అయ్యాయి. కేవలం ఇతర నటీనటులకు సంబంధించిన షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. నిన్నటి నుండి ఈ షూటింగ్ ని కూడా మొదలు పెట్టారు. నవంబర్ నెలాఖరు లోపు ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టి, ఫిబ్రవరి లేదా మార్చ్ రిలీజ్ కోసం మేకర్స్ చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇక మీదట భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా?, అంత సమయం ఉంటుందా లేదా? అనే అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సక్సెస్ మీట్ లో ప్రీక్వెల్, సీక్వెల్ చేయడానికి సిద్ధం అని చెప్పడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ఈ సినిమా మొదలు అయ్యే ముందే పవన్ కళ్యాణ్ మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి సాయి రామ్ థియేటర్ లో ఓజీ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నాడు. అనంతరం అభిమానులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారితో సినిమా ఉండబోతుంది అనే విషయాన్నీ ఖరారు చేసాడు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తాడట. అనిల్ వద్ద ఒక మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కమర్షియల్ కథ ఉందట. పవన్ కళ్యాణ్ సమయం ఇస్తే ఈ స్టోరీ ని వినిపించడానికి దిల్ రాజు, అనిల్ రావిపూడి సిద్ధంగా ఉన్నారట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే సమ్మర్ నుండే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.