Kannappa Movie Promotions: మరో రెండు రోజుల్లో మంచు విష్ణు(Manchu Vishnu) హీరో గా నటించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 5 వేలకు పైగా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. నేడు ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రాష్ట్రాల అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ట్రెండ్ ఎవ్వరూ ఊహించని విధంగా చాలా సాలిడ్ గా ఉంది. ఈ రేంజ్ బుకింగ్స్ జరుగుతాయని బహుశా మంచు విష్ణు కూడా ఊహించి ఉండదు. హైదరాబాద్ సిటీ నుండి కేవలం నాలుగు థియేటర్స్ కి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలెట్టారు. ఈ నాలుగు థియేటర్స్ నుండి దాదాపుగా 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మంచు ఫ్యామిలీ గత చిత్రాలకు క్లోజింగ్ లో కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదు అనేది వాస్తవం. ఈ సినిమాకు ఈ రేంజ్ బుకింగ్స్ జరగడానికి ప్రధాన కారణం రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) స్పెషల్ క్యారక్టర్ చేయడం వల్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఈ సినిమాలో ప్రభాస్ 40 నిమిషాల నిడివి ఉన్న క్యారక్టర్ ని చేసాడు. అంటే ‘గోపాల గోపాల’, ‘బ్రో’ చిత్రాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఎలాంటి క్యారెక్టర్స్ చేసాడో, అలాంటి క్యారక్టర్ అన్నమాట. ఈ సినిమా చేసినందుకు ప్రభాస్ మంచు విష్ణు నుండి ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదు. కేవలం మోహన్ బాబు మీద ఉన్న ప్రేమతో ఈ సినిమాని ఉచితంగా చేశాడు. ప్రభాస్ ఒక్క రోజు కాల్ షీట్ విలువ ఎన్నో కోట్ల రూపాయిలు ఉంటుంది. అయినప్పటికీ మోహన్ బాబు(Manchu Mohanbabu) అడిగిన వెంటనే ముందు వెనుక కూడా చూసుకోకుండా ఈ సినిమాకు డేట్స్ కేటాయించి, ఈ సినిమాకు బజ్ ఏర్పడడానికి ప్రధాన కారణం అయ్యాడు. అయితే ప్రభాస్ కచ్చితంగా కన్నప్ప మూవీ ప్రొమోషన్స్ లో పాల్గొంటాడని అంతా అనుకున్నారు. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కచ్చితంగా వస్తాడని అనుకున్నారు.
Also Read: Kannappa : కన్నప్ప వల్ల ప్రభాస్ పరువు పోతుందా..? ఏం జరగబోతుంది..?
కానీ ఆయన రాకపోవడం అభిమానులను కాస్త నిరాశకు గురి చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాకపోయినా పర్లేదు, కనీసం ఒక్క ఇంటర్వ్యూ అయినా ఇచ్చి ఉండుంటే బాగుండేది అని అంతా అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి జరిగినా కన్నప్ప చిత్రానికి మరింత పాజిటివ్ అయ్యేది అని ట్రేడ్ లో వినిపిస్తున్న వార్త. అయితే అడిగిన వెంటనే డేట్స్ ఇచ్చిన ప్రభాస్, ప్రొమోషన్స్ కి ఎందుకు రాలేదంటే, మంచు విష్ణు పిలవలేదని కొందరు అంటున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ సినిమాలో పని చేసాడు. అదొక్కటి చాలు, ఇప్పుడు ప్రొమోషన్స్ కి కూడా పిలిచి ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక పిలవలేదని అనుకుంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడే ప్రొమోషన్స్ కి తానూ రాలేనని ప్రభాస్ మంచు విష్ణు, మోహన్ బాబు తో చెప్పారని, అందుకే వాళ్ళు కూడా పిలవలేదని అంటున్నారు. ప్రొమోషన్స్ కి రాకపోయినా పర్వాలేదు. కనీసం ఇంటర్వ్యూ అయినా చేయించుకోవాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.