Mohan Babu Kannappa Story: మంచు విష్ణు(Manchu Vishnu) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తూ నిర్మించిన ‘కన్నప్ప'(Kannappa Movie) చిత్రం మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి మంచు విష్ణు ఎన్నో సందర్భాల్లో, ఎంతో గొప్పగా చెప్పుకొచ్చేవాడు. విష్ణు మాటలు అన్ని అతిశయోక్తి గానే ఉంటాయి కదా అని మొదట్లో నెటిజెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే ట్రైలర్ విడుదలైందో, అప్పటి నుండి ఈ సినిమా పై అంచనాలు పెరగడం మొదలైంది. పర్లేదే పాపం విష్ణు కష్టపడి చేసాడు, నిజాయితీ కనిపించింది, ఆయన ఈ చిత్రం గురించి చెప్పిన ప్రతీ మాట నిజమే అని జనాలు నమ్మడం మొదలు పెట్టారు. అలా నెమ్మదిగా అంచనాలను ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన ఈ చిత్రానికి సమందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ప్రభాస్ కోసం అభిమానులు ఎదురు చూసారు కానీ, ఆయన అందుబాటులో లేకపోవడం వల్ల రాలేదు.
Also Read: ఆ మహాశివుడి ఆదేశం కారణంగానే ‘కన్నప్ప’ చిత్రాన్ని చేశానంటూ మంచు విష్ణు కామెంట్స్!
ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో మోహన్ బాబు(Manchu Mohan babu) మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఆయన కన్నప్ప కథ ని చెప్పేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఒకటి రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యేసరికి కొంతమంది ఆకాశం నుండి దిగి వచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. కానీ మనమంతా ఆ భగవంతుడు ఆడించే ఆటలో నిమిత్త మాత్రులం మాత్రమే. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని అద్భుతంగా తెరకెక్కించి మీ ముందుకు తీసుకొని రాబోతున్నామంటే అదంతా శివానుగ్రహం వల్ల మాత్రమే. ఒక మంచి చిత్రాన్ని అందరి సహకారంతో నిర్మించాము. అందరి ఆశీస్సులు నా బిడ్డ మంచు విష్ణు పై ఉంటాయని ఆశిస్తున్నాను. ఈ సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అద్భుతాలను సృష్టించిన హీరోలు నటించారు. వాళ్లకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళు అందించిన సహాయ సహకారాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు.
డైరెక్టర్ మరియు సినిమా గురించి మాట్లాడుతూ ‘డైరెక్టర్ ముకేశ్ సింగ్ హిందీ లో మహాభారతం సీరియల్ ని ఎంత అద్భుతంగా తెరకెక్కించాడో మనమంతా చూసాము. ఈ సినిమాని ఆయన మాత్రమే అద్భుతంగా తీయగలడు అని మేమంతా బలంగా నమ్మాము. మా నమ్మకాలను మించి ఈ చిత్రాన్ని ముకేశ్ సింగ్ తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే తిన్నడు కన్నప్ప ఎలా అయ్యాడు, ఆ మధ్యలో జరిగిన ప్రయాణమే ఈ సినిమా. నీతిగా, నిజాయితీగా బ్రతికిన ఒక బోయవాడు, పరమ శివుడి అనుగ్రహాన్ని గావించి,అతని కళ్ళతోనే ఈ ప్రపంచాన్ని మొత్తం చూస్తానని అని కన్నప్ప తో ఆ మహాశివుడు అన్నాడంటే అంతకన్నా గొప్ప అదృష్టం ఏముంటుంది చెప్పండి. అలాంటి కన్నప్ప చరిత్ర నేటి తరం ప్రేక్షకులు తెలుసుకోవాలి. అందుకే భక్తి తో ఎక్కడా వెనకడుగు వేయకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాము’ అంటూ చెప్పుకొచ్చాడు మోహన్ బాబు.