https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాకు సిద్ధం అంటున్న కన్నడ స్టార్ డైరెక్టర్…

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని కోరుకునే చాలా మంది....

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 03:32 PM IST

    Kannada star director is preparing for a film with Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో కీలకపాత్ర వహిస్తున్నాడు. ఈ ఎన్నికల్లో 21 సీట్లను గెలిపించుకున్న పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కూడా కొనసాగుతూ ఉండటం విశేషం… నిజానికి ఎన్డీఏ కూటమితో కలిసిన పవన్ కళ్యాణ్ చాలా ఘన విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా తనను విమర్శించిన ప్రతి ఒక్కరికి ఆయన గెలుపే పెద్ద సమాధానం చెప్పింది. ఇక పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కొన్ని శాఖలకు మంత్రి గా వ్యవహరిస్తునే డిప్యూటీ సీఎం గా కూడా పదవి బాధ్యతలను స్వీకరించాడు.

    ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఎప్పటినుంచో పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయాలని కోరుకునే చాలా మంది దర్శక నిర్మాతలు మన ఇండస్ట్రీ లో ఉన్నారు. ఇక మనవాళ్లే కాకుండా కన్నడ స్టార్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ కూడా పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారట. పవన్ కళ్యాణ్ అంటే ఆయన చాలా అభిమానిస్తాడు దాంతో పాటుగా ఆయన సినిమాలను కూడా చూస్తూ వస్తున్నాడట.

    Also Read: Allu Arjun: అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడానికి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ 3 సినిమాలే కారణమా..?

    ఇక ఈ క్రమంలో ఒక భారీ కమర్షియల్ సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయగలిగితే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతున్నారట. ఇక పాలిటిక్స్ లో బిజీ అవుతున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను వదిలేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి క్రమంలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది అని చెప్పడం అనేది ఒక వంతుకు మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ కే జి ఎఫ్, సలార్ సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్నాడు.

    Also Read: Bharateeyudu 2: భారతీయుడు 2 ముందు ఉన్న టార్గెట్స్ ఇవే…

    కానీ పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయలేడు ఎందుకంటే ఆయన సినిమాలు చాలా స్లోగా లేట్ గా ఎండ్ అవుతాయి కాబట్టి స్టార్ డైరెక్టర్లు అన్ని రోజులపాటు ఒక సినిమా మీద కేటాయించే అవకాశాలు ఉండవు కాబట్టి ఆయన మీడియం రేంజ్ డైరెక్టర్లతో మాత్రమే సినిమాలు చేయడానికి ఇష్టపడతాడు. మరి పవన్ కళ్యాణ్ అంగీకరిస్తే ఆయనతో కూడా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో ఫ్యూచర్ లో అయిన సినిమా వస్తుందా రాదా అనేది…