Bharateeyudu 2: భారతీయుడు 2 ముందు ఉన్న టార్గెట్స్ ఇవే…

Bharateeyudu 2: ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ముందు రెండు టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఇక అందులో ఒకటి ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్ చేసిన విక్రమ్ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది.

Written By: Gopi, Updated On : June 19, 2024 1:51 pm

These are the targets for Bharateeyudu 2

Follow us on

Bharateeyudu 2: శంకర్ డైరెక్షన్ లో కమలహాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు 2 సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇంకా ఈ సినిమా జూలై 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇక ఈ క్రమంలోనే సినిమా మీద హైప్ ని పెంచడానికి భారీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే శంకర్ ఈ సినిమా భారీ సక్సెస్ అవుతుంది అంటూ ఒక మంచి నమ్మకంతో అయితే ఉన్నాడు. ఇక భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని రూపొందించారు. మొత్తానికైతే కమలహాసన్ ఈ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ముందు రెండు టార్గెట్స్ అయితే ఉన్నాయి. ఇక అందులో ఒకటి ఇంతకుముందు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో కమలహాసన్ చేసిన విక్రమ్ సినిమా భారీ సక్సెస్ ని అందుకుంది. ఇక ఈ సినిమా దాదాపు 500 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ భారతీయుడు 2 సినిమా భారీ వసూళ్లను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది.

Also Read: Ravi Teja: బాక్సాఫీస్ దగ్గర రవితేజ ను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు…

అలా అయితేనే శంకర్ మరోసారి తన మార్క్ సినిమా తీశాడు అంటూ ప్రేక్షకులందరూ ఆయన సినిమాలకు బ్రహ్మ రథం పడతారు. ఇక దీంతోపాటుగా ఇండస్ట్రీలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాల రికార్డులను కూడా ఈ సినిమా బ్రేక్ చేయాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే శంకర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా ఇంతకు ముందు ఉన్న అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ అయితే ప్రేక్షకులందరిలో ఉండేది.

Also Read: Pushpa 2: పుష్ప 2 కి షాక్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్స్.. దీనికంతటికీ కారణం ఏంటంటే..?

ఇక గత కొద్దిరోజుల నుంచి ఆయనకు ప్లాప్ సినిమాలు రావడంతో ఆ నమ్మకన్నైతే జనాలు కోల్పోయారు. ఇక మరోసారి వాళ్లకి ఆయన మీద నమ్మకం రావాలి అంటే మాత్రం ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది…