https://oktelugu.com/

Allu Arjun: అల్లు అర్జున్ స్టార్ హీరో అవ్వడానికి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఈ 3 సినిమాలే కారణమా..?

Allu Arjun: మహేష్ బాబు చేయాల్సిన కొన్ని సినిమాలను అల్లు అర్జున్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ మూడు సినిమాల విషయంలో మాత్రం మహేష్ బాబు అన్ లక్కీ అనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 19, 2024 / 01:55 PM IST

    Are these 3 movies rejected by Mahesh Babu the reason why Allu Arjun became a star hero

    Follow us on

    Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతోనే హీరోగా ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక మొదటి సినిమా నుంచి తనకంటూ ఒక సపరేట్ క్యారెక్టరైజేషన్ ను ఏర్పాటు చేసుకొని డిఫరెంట్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమా కోసమే తీవ్రమైన కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గత ఐదారు నెలల నుంచి ఈ సినిమాకు సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక మహేష్ బాబు ఎన్ని రకాల లుక్ లో కనిపించినప్పటికీ రాజమౌళి మాత్రం తనకు నచ్చిన విధంగా సెట్ అయ్యేంతవరకు ఆయన మేకోవర్ చేస్తూనే వస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే మహేష్ బాబు చేయాల్సిన కొన్ని సినిమాలను అల్లు అర్జున్ చేసి సూపర్ సక్సెస్ లను అందుకున్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ మూడు సినిమాల విషయంలో మాత్రం మహేష్ బాబు అన్ లక్కీ అనే చెప్పాలి. అందులో మొదటిది గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘రుద్రమదేవి ‘ సినిమా అనే చెప్పాలి.

    ఇక ఇందులో ‘గోనగన్న రెడ్డి’ క్యారెక్టర్ లో మొదట మహేష్ బాబుని తీసుకోవాలనుకున్నారు. కానీ ఆ పాత్ర ను మహేష్ బాబు రిజెక్ట్ చేశాడు. దాంతో అల్లు అర్జున్ ఆ పాత్ర చేసి మంచి గుర్తింపునైతే ఏర్పాటు చేసుకున్నాడు… ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అలావైకుంఠపురంలో సినిమా కూడా మహేష్ బాబు తోనే చేయాలనుకున్నారు. కానీ మహేష్ బాబు డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ సినిమాని అల్లు అర్జున్ తో చేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డుని బ్రేక్ చేసిందనే చెప్పాలి.

    ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా స్టోరీ మొదట సుకుమార్ మహేష్ బాబుతో చేయాలనుకున్నాడు. కానీ మహేష్ బాబు కథలో కొన్ని మార్పులు చేర్పులు చెప్పడంతో సుకుమార్ కు అది నచ్చలేదు. అందుకే ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చేసి ఆయన అల్లు అర్జున్ తో ఈ సినిమాని చేశాడు. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. ప్రస్తుతం పుష్ప 2 కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇలా మహేష్ బాబు వదిలేసుకున్న మూడు సినిమాలతో అల్లు అర్జున్ సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు…