Kannada Comedy Actor: అతడు చూడ్డానికి నల్లగా ఉంటాడు. కానీ హావభావాలు అద్భుతంగా ప్రదర్శిస్తాడు. డైలాగ్ డెలివరీ లో సరికొత్త తనాన్ని వ్యక్తం చేస్తాడు. అందువల్లే అతడంటే చాలామందికి ఇష్టం. న్యూ ఏజ్ కామెడీని పండించడంలో అతడు దిట్ట. అందువల్లే కన్నడ అభిమానులు అతన్ని విపరీతంగా ఇష్టపడతారు. దీంతో అతడు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అతని పేరే చంద్రశేఖర్ సిద్ది. ఓవర్ నైట్ స్టార్ అయినప్పటికీ మొదట్లో వచ్చిన అవకాశాలు రాకపోవడంతో వేరే మార్గం లేక గ్రామానికి వెళ్లిపోయాడు
Also Read: ‘బిగ్ బాస్’ లేకుండానే ‘బిగ్ బాస్ 9’..ఈ సీజన్ కాన్సెప్ట్ చూస్తే మతిపోతుంది!
కన్నడ చిత్ర పరిశ్రమలో వర్ధమాన హాస్య నటుడుగా పేరు తెచ్చుకుంటున్న చంద్రశేఖర్ సిద్ది జూలై 31న ఉరివేసుకున్నాడు. వాస్తవానికి చంద్రశేఖర్ కు ఇటీవల కాలంలో అవకాశాలు దూరమయ్యాయి.. ఆర్థికంగా కూడా కష్టాలు వెంటాడుతున్న నేపథ్యంలో గ్రామానికి వెళ్లి కూడి పనులు చేసుకుంటున్నాడు. అయితే అటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం కన్నడ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. చంద్రశేఖర్ సిద్ది కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. వారు కేసు నమోదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టారు.
Also Read: ‘పరదా’ మూవీ ట్రైలర్ లో ఆ ఒక్కటి తగ్గిందా..?
చంద్రశేఖర్ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధి తెగకు చెందినవాడు. ఇతడు కామెడీ కిలాడిగలు అనే రియాల్టీ షో ద్వారా పాపులర్ అయ్యాడు. అంతేకాదు చాలా సీరియల్స్ లో కనిపించాడు. మొదట్లో అవకాశాలు బాగానే వచ్చేవి. ఆ తర్వాత అవి పూర్తిగా తగ్గిపోయాయి. అవకాశాలు లేకపోవడంతో సంపాదన కోసం అతడు సొంత ఊరికి వెళ్ళిపోయాడు.. అక్కడ కూలి పనులు చేసుకుంటున్నాడు. అంతేకాదు డిప్రెషన్ సమస్యతో కూడా అతడు బాధపడుతున్నాడు. ఇటీవల తన భార్యతో గొడవ జరిగింది. అతడు ఇష్టానుసారంగా మాట్లాడటంతో ఆమె చీపురుతో కొట్టింది. భార్య చీపురుతో కొట్టడాన్ని అవమానంగా భావించిన అతడు మనోవేదనకు గురయ్యాడు.. జూలై 31న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులకు విచారణలో ఈ విషయాన్ని అతని భార్య చెప్పింది.