Mass Jathara Teaser Review: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న హీరోలలో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) లాగా అన్ని యాంగిల్స్ లోను నట విశ్వరూపం చూపించగల హీరోలలో ఒకరు మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja). కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ ఇలా ఏది తీసుకున్నా రవితేజ పేకాడేస్తాడు. సరిగ్గా వాడుకోవాలి కానీ ఆయన ఒక బాక్స్ ఆఫీస్ విస్ఫోటనం లాంటి హీరో. మొదటి నుండి రవితేజ కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేస్తూ వచ్చాడు. వాళ్ళే ఆయన్ని ఇంతటి స్థాయికి తీసుకొచ్చారు. హరీష్ శంకర్, బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బాబీ ఇలా ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ నేడు ఇండస్ట్రీ లో ఇంత గొప్ప స్థాయిలో కొనసాగుతున్నారంటే అందుకు కారణం రవితేజ నే. అంతే కాదు పూరి జగన్నాథ్ బాగా షైన్ అయ్యింది కూడా రవితేజ సినిమాలతోనే. ఇప్పటికీ కూడా రవితేజ కొత్తవాళ్ళనే ప్రోత్సహిస్తూ వస్తున్నారు, కానీ ఆయన మార్కెట్ ప్రస్తుతం నాశనం అవ్వడానికి ఈ కొత్త డైరెక్టర్స్ కారణం అనొచ్చు.
Also Read: హృతిక్ రోషన్ హిస్టరీ గురించి ఎన్టీఆర్ కి తెలియదా..? అలా ఎలా నోరు జారాడు?
‘ధమాకా’ చిత్రం తర్వాత రవితేజ చేసిన ప్రతీ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఒక్క హరీష్ శంకర్ తప్ప, ఆయన గత 5 చిత్రాలకు దర్శకులు కొత్త వాళ్ళే అవ్వడం విశేషం. వీళ్లంతా రవితేజ మార్కెట్ దెబ్బతినే స్థాయి సినిమాలు తీశారు. రీసెంట్ గా రవితేజ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ‘మాస్ జాతర'(Mass Jathara) అనే చిత్రం లో నటించాడు. శ్రీలీల(Sreeleela) ఇందులో హీరోయిన్ గా నటించగా భాను భోగవరాజు దర్శకత్వం వహించాడు. రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన పాట ఎంత వివాదాస్పదంగా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ తో పాటని నింపేశారు తప్ప, వినసొంపు గా ఉండే ట్యూన్ లేదు, లిరిక్స్ దారుణంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెదవి విరిచారు. ఇకపోతే నేడు ఈ సినిమాకు సంబందించిన టీజర్ విడుదలైంది.
Also Read: ‘వార్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనాలు లేరంటూ ట్రోల్స్..కానీ అసలు వాస్తవం ఇదే!
ఈ టీజర్ లో రవితేజ లుక్స్ చూడగానే మన అందరికీ క్రాక్ సినిమాలోని రవితేజ గెటప్ నే గుర్తుకొచ్చింది. అందులోనూ పోలీసే, ఇందులో కూడా పోలీసే. టీజర్ లో రవితేజ ని మంచి మాస్ గా చూపించారని అనిపించింది కానీ, డైలాగ్స్ మాత్రం చాలా చిల్లరగా ఉన్నట్టుగా అనిపించాయి. సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి ట్రోల్స్ ఎదురు అవుతున్నాయి. సైన్స్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంటర్మీడియట్ లో నాకు నూటికి నూరు మార్కులు వచ్చాయి అని రవితేజ శ్రీలీల తో అంటాడు. అప్పుడు శ్రీలీల ‘ఇంటర్ లో ఉన్నది 60 మార్కులే కదా’ అని అంటుంది. ఇది రవితేజ రేంజ్ కి తగ్గ జోకా చెప్పండి?, మళ్ళీ శ్రీలీల ని పక్కకి తీసుకెళ్లి ‘చేసేద్దాం’ అని డబుల్ మీనింగ్ వచ్చే డైలాగ్ కొడుతాడు. రవితేజ వయస్సుకి ఆయన సరసన శ్రీలీల ని హీరోయిన్ గా పెట్టడాన్నే అందరూ వ్యతిరేకిస్తున్నారు, ఇలాంటి సమయం లో ఆమెతో కలిసి ఇంత నాటు రొమాంటిక్ డైలాగ్స్ చెప్పించడం అవసరమా?, డైరెక్టర్ ఈమధ్య కాలం లో అడల్ట్ కంటెంట్ ని యూత్ ఆడియన్స్ ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఇష్టమొచ్చినట్టు ఇలాంటి డైలాగ్స్ తో సినిమాని నింపేసాడని అర్థం అవుతుంది, కానీ జనాలు ఈ రేంజ్ లో ఉంటే తిప్పి కొడుతారు అనే విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నాడు.
