Parada Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను అందుకోవడానికి హీరోలు తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నా కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన అయితే వస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ లాంటి నటి చాలా సినిమాలు చేసినప్పటికి ఆమెకు హీరోయిన్ గా మంచి గుర్తింపైతే వచ్చింది. కానీ పర్ఫామెన్స్ ఇప్పటివరకు పాన్ ఇండియా గుర్తింపైతే రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆమె పర్ఫామెన్స్ బేస్డ్ సినిమాని పెద్దగా చేయలేదు. అందుకే ఆమె ఏరికోరి మరి పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రను చేయాలనే ఉద్దేశ్యంతో ‘పరదా’ అనే సినిమాని చేసింది. ఈ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ ని కనక మనం గమనించినట్లయితే ఊరు కట్టుబాట్లకు సంబంధించిన సినిమాగా తెలుస్తోంది. ఆ ఊర్లోని అమ్మాయిలందరు పరదాలు వేసుకొని తమ ముఖాన్ని ఎవ్వరికి చూపించకుండా తిరుగుతూ ఉంటారు. మరి ఆ పరదాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? వాళ్ళు ఎందుకు పరదాల వెనక ముఖాన్ని దాస్తున్నారు. వేరే వాళ్లకు చూపిస్తే ఏం జరుగుతుంది. వాళ్లది నిజంగానే ఒక ఆచారమా? లేదంటే మూఢ నమ్మకమా అనే విషయాలను ఈ సినిమాలో చాలా స్పష్టంగా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈ ట్రైలర్ లో అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమా మొత్తం తన మీదే రన్ అవుతుండడం వల్ల ఆమె ఆల్మోస్ట్ అన్ని సీన్లలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: పెళ్లయ్యాక అక్కడ ఆ ఆనందంలో కీర్తి సురేష్..
మరి ఆమె ఏ లెవెల్లో ఈ సినిమాను నిలబెడుతోంది ఎన్డీ తెలియాల్సి ఉంది… ఈ సినిమా వల్ల ఆమె కెరియర్ టాప్ రేంజ్ లోకి దూసుకెళ్తుందా..? అనేది కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా ట్రైలర్ ని కనక చూసినట్లయితే అనుపమ పరమేశ్వరన్ తన పరదా ను తీసిన వెంటనే ఒక్కసారిగా అరుస్తోంది. మరి ఎందుకని అక్కడి ప్రజలు అలా వ్యవహరిస్తున్నారు.
అక్కడి ప్రజల్లో ఏదైనా కుట్ర ఉందా లేదంటే కావాలనే వాళ్ళను అలా మార్చేశారా? లేదంటే నిజంగానే ఇది ఒక నమ్మకానికి సంబంధించిందా? అనేది ఇప్పుడు కీలకమైన అంశంగా తెలుస్తోంది. అయితే అన్ని ఒకే అనిపించినప్పటికి సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ప్రేమను హైలెట్ చేసి చూపించలేకపోయారు.
Also Read: అభిమానులు అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో.. చూస్తూ ఉండిపోయిన హృతిక్ రోషన్
అలాగే ఆమె దేనికోసం ఫైట్ చేస్తుంది అనేది కూడా క్లారిటీ గా చెప్పలేకపోయారు…అంటే వాటిని ట్విస్టుల మాదిరిగా వాడుకుంటున్నట్టుగా ఉన్నారు… మరి ఈ సినిమాకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియాలి అంటే మాత్రం ఆగస్టు 22వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే..
