ప్రియుడి మోజులో భర్తలను హత్య చేస్తోన్న భార్యల గురించి విన్నాం, కానీ సొంత తమ్ముడినే హత్య చేసిన కేసు ఇది. పైగా ఒక హీరోయిన్ ఇలా చేసింది అంటే నమ్మలేం. కానీ కన్నడ హీరోయిన్ ‘షనాయా కాట్వే’ సొంత తమ్ముడినే హత్య చేసి వార్తల్లో నిలిచింది. షనాయా కాట్వే కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా నటిగా నిలబడాలని గత కోనేళ్ళుగా విశ్వప్రయత్నాలు చేస్తోంది. మధ్యలో కొన్ని సినిమాలు చేసింది గానీ, అమ్మడికి సరైన బ్రేక్ రాలేదు. కానీ అంతలో హత్య కేసులో బ్రేకింగ్ అయిపోయింది.
అసలు మ్యాటర్ లోకి వెళ్తే.. కన్నడ సినిమా పరిశ్రమలో పలువురు హీరోయిన్స్ కు మేనేజర్ గా వ్యవహరించిన నియాజ్ అహ్మద్ ను షనాయా కాట్వే ప్రేమించింది. అతను కూడా ఈమెగారిని ప్రేమించాడట. ఇద్దరు ప్రేమ లోకంలో విహరిస్తూ ఉండగా ‘షనాయా కాట్వే తమ్ముడు రాకేష్’ ఆ ప్రేమకు అడ్డుగా నిలిచాడు. కొన్నాళ్ల క్రితం షనాయా కాట్వే , తన తమ్ముడు మాట ప్రకారం ప్రియుడికి దూరంగా ఉంది. ఆ దూరమే ఆమెకు తమ్ముడి పై పగ పట్టేలా చేసింది. తన సుఖానికి అడ్డుగా మారిన తమ్ముడు అడ్డును తొలిగించుకోవాలని చూసింది.
మరో పక్క తన అక్క ప్రేమ విషయమై రాకేష్ తీవ్రంగా అడ్డు చెప్పాడు. ప్రేమికులిద్దర్నీ మందలించే ప్రయత్నం కూడా చేశాడు. అప్పటికే ప్రియుడి మోజులో పీకల్లోతూ మునిగి పోయిన హీరోయిన్ కు, తమ్ముడు మాటలు అంతగా రుచించలేదు. తమ్ముడిపై కోపంతో రగిలి పోయింది. తమ్ముడ్ని ఏకంగా హత్య చేసేంతగా కోపం పెంచుకుంది. దీనికితోడు ఆమె తమ్ముడు కూడా ఆమె పై పలు సార్లు చేయి చేసుకున్నాడు. పైగా తన ప్రియుడిని కనీసం కలవడానికి కూడా అంగీకరించవాడు కాదు. దాంతో ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. తమ్ముడితో పదే పదే గొడవలు పడే బదులు పథకం ప్రకారం చంపేస్తే ఇక తనకు ఏ బాధ ఉండదు అని నిర్ణయించుకుంది.
నిర్ణయం తీసుకున్న తరువాత.. తన ప్లాన్ ను పక్కాగా అమలు చేసింది. తమ్ముడిని చంపేసి ఆ డెడ్ బాడీని కారులో దాచిపెట్టి.. ఎవ్వరికీ అనుమానం రాకుండా ఉండాలని.. ఆ తర్వాత మృతదేహంను ముక్కలు ముక్కలుగా కోసి హుబ్బళ్లిలోని పలు ప్రాంతాల్లో పలుచోట్ల పడేసి ఏమి తెలియనట్టు సైలెంట్ అయిపోయింది. ప్రియుడితో కలిసి టూర్ లు వేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. కానీ పోలీసులు ఊరుకోరు కదా, ఆమె తమ్ముడు రాకేష్ మృతి పై కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేశారు. జస్ట్ తీగ లాగితే డొంక అంతా కదిలింది.