Nandamuri Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలను ప్రకటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమాను బాలయ్య కంప్లీట్ చేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మరోవైపు తన 107 వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్.
ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అలానే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారట. అందులో ఒకరిగా శృతిహాసన్ ను ఎంపిక చేస్తూ దీపావళి కానుకగా పోస్టర్ ను విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం మరో స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ‘క్రాక్’ సినిమాలో విలన్స్ కోసం కోలీవుడ్ నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖనిలను తీసుకొచ్చారు గోపిచంద్.
ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను తీసుకొస్తున్నారని టాక్ నడుస్తుంది. ప్రముఖ నటుడు దునియా విజయ్ ను బాలయ్య సినిమాలో విలన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని సినివర్గాల్లో చర్చించుకుంటున్నారు. కన్నడలో విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన ‘దునియా’ అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో అందరూ “దునియా విజయ్” అని అనే పిలుస్తుంటారు. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.