https://oktelugu.com/

Kanguva Collection: సూర్య ‘కంగువా’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..చరిత్రలో ఇలాంటి డిజాస్టర్ ని ఎప్పుడూ చూసి ఉండరు!

మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయి? ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతకు జరిగింది?, అసలు రికవరీ అయ్యే అవకాశం ఉందా?, ఉంటే ఎంత వరకు రికవర్ అవ్వొచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 18, 2024 / 05:30 PM IST

    Kanguva Collection

    Follow us on

    Kanguva Collection: సౌత్ ఇండియా లోని అన్ని రాష్ట్రాల్లో రజినీకాంత్ తర్వాత ఇప్పటికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోలలో ఒకడు సూర్య. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ ఈయనని అమితంగా ఇష్టపడుతారు. ఒకానొక దశలో సూర్య తెలుగు హీరోనా? అనే అనుమానాలు వచ్చేవి. ఆ స్థాయి మార్కెట్ ఆయన సొంతం. కానీ ఈమధ్య కాలంలో ఆయన వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు తియ్యడం వల్ల ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. అయినప్పటికీ కూడా సూర్య క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. ఒక మంచి సినిమా తీస్తే మళ్ళీ కం బ్యాక్ ఇస్తాడు. మన తెలుగు హీరోలతో సమానమైన వసూళ్లను రాబడుతాడు అని బలంగా నమ్మారు. ఆ సరైన చిత్రం ‘కంగువా’ అని బలంగా నమ్మారు. ఎందుకంటే భారీ బడ్జెట్ పీరియడ్ చిత్రం, టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది కాబట్టి. కానీ విడుదల తర్వాత ఆ అంచనాలను ఈ సినిమా ఏ మాత్రం కూడా అందుకోలేదు.

    మొదటి ఆట నుండి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు వచ్చాయి? ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతకు జరిగింది?, అసలు రికవరీ అయ్యే అవకాశం ఉందా?, ఉంటే ఎంత వరకు రికవర్ అవ్వొచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా పాతిక కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజులకు కలిపి తెలుగు లో కేవలం 7 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిలు వచ్చే అవకాశం ఉంది. అంటే దాదాపుగా 15 కోట్ల రూపాయిల నష్టం రానుంది అన్నమాట. ఇది వరకు విడుదలైన సూర్య సినిమాల్లో, అత్యధిక నష్టాన్ని తెచ్చిన చిత్రంగా ‘కంగువా’ చిత్రం నిల్చింది.

    ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 26 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఈ ప్రాంతంలో డిజాస్టర్ అనే పదం ఈ సినిమాకి వాడితే అది చాలా చిన్నది అవుతుంది. విజయ్, అజిత్ వంటి హీరోలకు మొదటి రోజు వచ్చే వసూళ్లు, సూర్య కంగువా చిత్రానికి నాలుగు రోజులకు కలిపి వచ్చింది. అదే విధంగా కర్ణాటక లో 4 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేరళలో 5 కోట్ల 80 లక్షలు, నార్త్ ఇండియా లో 13 కోట్లు, ఓవర్సీస్ లో 22 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో ఈ చిత్రానికి 84 కోట్ల రూపాయిల గ్రాస్, 41 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.