https://oktelugu.com/

Allu Arjun: కిరణ్ అబ్బవరం కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన అల్లు అర్జున్..కారణం ఏమిటంటే!

అల్లు అర్జున్ స్పందిస్తూ 'చాలా థాంక్యూ మై డియర్ బ్రదర్..అదే విధంగా నీకు శుభాకాంక్షలు కూడా. 'క' చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి.. 'పుష్ప 2 ' షూటింగ్ లో బిజీ గా ఉండడం వాళ్ళ నీ సినిమాని చూడలేకపోయాను.

Written By:
  • Vicky
  • , Updated On : November 18, 2024 / 05:16 PM IST

    Allu Arjun(10)

    Follow us on

    Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ థియేట్రికల్ ట్రైలర్ నిన్న విడుదలై ఆడియన్స్ నుండి, ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం అభిమానుల నుండి మాత్రమే కాకుండా, సెలబ్రిటీస్ నుండి కూడా ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా మన తెలుగు సినిమా స్థాయి ప్రపంచ పటంలో పెట్టి, ఆస్కార్ అవార్డుని సాధించి, హాలీవుడ్ మొత్తం మన టాలీవుడ్ పై చూసేలా చేసిన రాజమౌళి కూడా నేడు ఈ ట్రైలర్ పై స్పందించి అల్లు అర్జున్, సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. రాజమౌళి తో పాటుగా మీడియం రేంజ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు కూడా స్పందించారు. వారిలో ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నాడు. ట్రైలర్ ని చూసిన వెంటనే ఆయన ట్విట్టర్ లో ‘వైల్డ్ ఫైరు’ అని ట్వీట్ వేస్తాడు.

    దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ ‘చాలా థాంక్యూ మై డియర్ బ్రదర్..అదే విధంగా నీకు శుభాకాంక్షలు కూడా. ‘క’ చిత్రం చాలా పెద్ద హిట్ అయ్యింది. కానీ నువ్వు నన్ను ఒక విషయంలో క్షమించాలి.. ‘పుష్ప 2 ‘ షూటింగ్ లో బిజీ గా ఉండడం వాళ్ళ నీ సినిమాని చూడలేకపోయాను. కానీ వీలు చూసుకొని కచ్చితంగా చూస్తాను. నీకు కాల్ చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్ కి కిరణ్ అబ్బవరం సమాధానం చెప్తూ ‘థాంక్యూ వెరీ మచ్ అన్నా..డిసెంబర్ 5 కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ రిప్లై ఇస్తాడు. వీళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ అభిమానులకు చాలా బాగా అనిపించింది. అల్లు అర్జున్ కి ఏ మాత్రం ఈగో లేదని, ఇండస్ట్రీ లో అప్పుడే ఎదుగుతున్న నటీనటులను ప్రోత్సహించడం ముందు ఉంటాడని ఈ సందర్భంగా ఆయన్ని పొగుడుతున్నారు అభిమానులు.

    ఇది ఇలా ఉండగా డిసెంబర్ 5న విడుదల అవ్వబోతున్న పుష్ప 2 కి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే రామోజీ ఫిలిం సిటీ లో శ్రీలీల , అల్లు అర్జున్ మధ్య ఐటెం సాంగ్ ని చిత్రీకరించిన మూవీ టీం, గత మూడు రోజుల నుండి సారధి స్టూడియోస్ లో అల్లు అర్జున్, రష్మిక మధ్య ఒక డ్యూయెట్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు. నిన్న పాట్నా లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని జరపగా, సాంగ్ షూటింగ్ కి కాస్త గ్యాప్ వచ్చింది. రేపటి నుండి మళ్ళీ షూటింగ్ మొదలు కానుంది. అదే విధంగా క్లైమాక్స్ కి సంబంధించి చిన్న రీ షూట్ కూడా చెయ్యాలని అనుకుంటున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఇవన్నీ పూర్తి అయ్యి మొదటి కాపీ సిద్ధమయ్యే లోపు డిసెంబర్ 1 అయిపోతుందని సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతుంది. కానీ అనుకున్న సమయానికి నార్త్ అమెరికా ప్రీమియర్స్ కి డ్రైవ్స్ ని పంపేందుకు సిద్ధం చేస్తున్నారట మేకర్స్.