బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ ( Kangana Ranaut) ఏమి మాట్లాడిన ప్రత్యేకమే. కొత్తగా ఈ బ్యూటీ అంతర్జాతీయ సమస్యల గురించి మాట్లాడింది. అఫ్గానిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు చేస్తోన్న ఆరాచాకాల గురించి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ అంశం పై సంచలనాల తార మాట్లాడకపోతే ఎలా ? అందుకే కంగనా నోరు విప్పింది.
సోషల్ మీడియా వేదికగా తాలిబన్ల పై కొన్ని పోస్టులు పెట్టింది. అయితే, కంగనా ఇన్‌స్టా అకౌంట్ చైనా హ్యాక్ చేసిందట. అదేంటి చైనా ఎందుకు హ్యాక్ చేస్తోంది ? అంటే.. కంగనా స్పందిస్తూ… ‘తాలిబన్ల పై నేను పెట్టిన పోస్టులు ప్రస్తుతం లేవు. నిన్న రాత్రి చైనాకు చెందిన వారు నా ఇన్ స్టాగ్రామ్ ఖాతాను హ్యాక్ చేసినట్లు నాకు అలర్ట్ వచ్చింది.
అయితే, దాని గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. తెల్లవారుజామున లేచి చూశాను. అలర్ట్ మెసేజ్ ఉంది. అలాగే నేను తాలిబన్ల గురించి పెట్టిన పోస్ట్ లు మాత్రం లేవు. ఏమైంది అని నేను చెక్ చేసేలోపే కాసేపటికి నా అకౌంట్ కూడా ఓపెన్ అవ్వడం ఆగిపోయింది. కొంత సమయం అయితే, అసలు నా అకౌంట్ కనిపించలేదు.
వెంటనే నేను తేరుకుని ఇన్ స్టాగ్రామ్ (Instagram) నిర్వహాకులకు ఫిర్యాదు చేశాను. వాళ్ళు వెంటనే నా అకౌంట్ తిరిగి యాక్టివేట్ చేశారు. అయితే, నేను ఏ మెసేజ్ చేద్దామని ప్రయత్నం చేసినా.. నా ఎకౌంట్ లాగ్ అవుట్ అయిపోతుంది. వేరే ఫోన్ నుండి చూసినా ఇదే సమస్య. నేను నమ్మలేకపోతున్నాను. ఇది అంతర్జాతీయ కుట్రలో భాగం అనిపిస్తుంది’ అంటూ కంగనా ఒక పోస్ట్ పెట్టింది.
అందర్నీ అడ్డమైన తిట్లు తిట్టి మొత్తానికి ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది కంగనా. ఇక చాలా గ్యాప్ తర్వాత ఓ రేంజ్ లో ఎక్స్ పోజ్ చేస్తూ ఈ మధ్య ఒక ఫోటో షూట్ చేసింది కంగనా. ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి కూడా. మళ్ళీ అలాంటి ఫోటో షూట్లు కోసం రెడీ అవుతుంది కంగనా.