పవన్ కళ్యాణ్ భక్తుడు ‘బండ్ల గణేష్’ ( Bandla Ganesh) ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాడు. తనకు ఆ స్వభావం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అబ్బింది అట. పైగా మొహమాటం అనేది తన బ్లడ్ లోనే లేదనేది ఎపుడూ బండ్ల చెప్పే మాట. తాజాగా బండ్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ గురించి సరికొత్త కామెంట్స్ చేశాడు.
బండ్ల తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా బండ్ల మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల్లో గెలవడం కోసం పోటీ చేస్తున్న ప్రతిఒక్కరూ ‘మా’కు శాశ్వత భవనం నిర్మించాలని, నిర్మిస్తామని అభయం ఇస్తూ బరిలోకి దిగారు. అయితే, వాస్తవం మాట్లాడుకుంటే.. అసలు ‘మా’కు బిల్డింగ్ (MAA New Building) ఎందుకు అండి ? నేను ‘మా’ బిల్డింగ్ కి వ్యతిరేకిని.
ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దు. ‘మా’కి ఒక భవనం ఎంత అవసరమో.. దానికి కంటే అవసరమైనవి కొన్ని ఉన్నాయి. ‘మా’లో ఉన్న 900 మందిలో చాలా వరకు పేదవారు. ఇప్పటికీ సరైన ఆర్థిక స్థోమత లేనివారు. కాబట్టి.. ‘మా’ బిల్డింగ్ నిర్మాణం కోసం ఖర్చు పెట్టే.. ఆ రూ.20 కోట్లను ఆ పేద కళాకారులందరి ఇంటి కోసం ఖర్చు పెడితే మంచింది.
ప్రతి పేదవాడికి ఒక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఉచితంగా ఇస్తే.. అది గొప్ప అని నేను ఫీల్ అవుతాను. పైగా ఇలాంటి గొప్ప పని కోసం స్టార్ హీరోలు కూడా అడగకుండానే ముందుకు వచ్చి సాయం చేస్తారు. కాబట్టి, ‘మా’కి బిల్డింగ్ కంటే కూడా ఇండస్ట్రీకి చేయాల్సింది ఎంతో ఉంది’ అంటూ బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు.
అన్నట్టు బండ్ల గణేశ్ ముందు నుంచి తన మద్దతును ప్రకాశ్ రాజ్ ప్యానల్ కు ఇస్తున్నాడు. ఏది ఏమైనా బండ్ల గణేష్ చాలా కిందిస్థాయి నుండి వచ్చిన వ్యక్తి. అందుకే, పేదవాళ్లకు ఏమి కావాలో తెల్సిన వ్యక్తి. మరి బండ్ల చెప్పినట్లుగా పేదవాళ్ల ఇంటి కలను ‘మా’ సంఘం తీరుస్తోందా ? చూడాలి.