https://oktelugu.com/

కమల్ హాసన్ ఓ గుడ్డివాడిగా.. !

సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ తన తర్వాతి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇటీవలే అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ‘ఖైదీ’ చిత్రంతో మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, పైగా కమల్ హసన్ కి బాగా నచ్చిన కథ కావడంతో.. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మారోపక్క లోకేష్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 16, 2020 / 05:08 PM IST
    Follow us on


    సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ తన తర్వాతి చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఇటీవలే అనౌన్స్ చేసిన దగ్గర నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ‘ఖైదీ’ చిత్రంతో మెప్పించిన లోకేష్ కనగరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, పైగా కమల్ హసన్ కి బాగా నచ్చిన కథ కావడంతో.. ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మారోపక్క లోకేష్ కానగరాజ్ ప్రస్తుతం విజయ్ హీరోగా చేస్తోన్న ‘మాస్టర్’ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ సినిమా టీజర్ మొన్న విడుదలై సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది.

    Also Read: రియల్ హీరో సోనుసూద్ సాయం వెనుక ఉందెవరు?

    దాంతో కనకరాజు డైరెక్షన్ పై రెట్టింపు నమ్మకం కలగడం కూడా ఇప్పుడు కమల్ తో చేస్తోన్న సినిమాకి బాగా ప్లస్ కానుంది. అయితే ఇప్పటికే మాస్టర్ అన్ని పనులు పూర్తిచేసుకోవడంతో.. కనకరాజు ప్రస్తుతం కమల్ హాసన్ సినిమా స్క్రిప్ట్ పై కూర్చున్నాడు. కాగా తాజాగా ఈ సినిమా పై ఒక ఇంట్రస్టింగ్ గాసిప్ ఒకటి వినిపిస్తోంది. ఈ సినిమాలో కమల్ హాసన్ గుడ్డివాడిగా నటిస్తున్నాడట. కళ్ళు కూడా కనబడని ఓ వ్యక్తి భయంకరమైన వ్యక్తులతో పోరాడి ఎలా గెలిచాడు అనేది సినిమా మెయిన్ పాయింట్ అట. పాయింట్ అయితే బాగుంది గాని, సినిమా మొత్తం గుడ్డివాడిగా నటిస్తే.. ఎలా అనేది కమల్ ఫ్యాన్స్ ఆందోళన.

    Also Read: కరోనాను టార్గెట్ చేసిన బాలయ్య.. ఏమన్నాడంటే?

    ఇక కొన్నిరోజులుగా ఈ సినిమాకు ‘గురు’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి గాని, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ చిత్రం రాజకీయ నేపథ్యంలో సాగే పొలిటికల్ థ్రిల్లర్ కాబట్టి పక్కా మాస్ టైటిల్ అయితేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. మరి ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఫైనల్ చేసి సప్రైజ్ ఇస్తారో చూడాలి. కమల్ సొంత బ్యానర్లో నిర్మితంకానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుందని తెలుస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్