సీఎం జగన్ ను సీఎం పదవి నుంచి దించాలంటూ సుప్రీంకోర్టు న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ యాదవ్, సునీల్ కుమార్ సింగ్ లు అప్పట్లో వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ వివిధ అక్రమాస్తుల కేసులు విచారణలో ఉన్నాయని.. ఆధారాలు లేకుండా సుప్రీం జడ్జిపై ఆరోపణలు చేశారని.. ఆయనను పదవి నుంచి తొలగించాలని వారు పిటీషన్ లో సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే.
Also Read: ఏపీ పొలిటికల్ సీక్రెట్: ఆ మంత్రి షాడోదే పెత్తనమట?
ఈ క్రమంలోనే సీఎం జగన్ ఏపీ పరిణామాలపై కలత చెంది సంధించిన లేఖ కలకలం సృష్టించింది. సుప్రీం కోర్టు జడ్జిపై ఇటీవల ఓ లేఖ రాసి సంచలనం సృష్టించారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ క్రమంలోనే జగన్ కు వ్యతిరేకంగా పలు పిటీషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. జగన్ ను సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.. తాజాగా ఈ పిటీషన్లు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. ఈ పిల్ ను తాను విచారణ చేపట్టలేనని ఈ కేసు విచారణకు వచ్చిన ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ తెలిపారు.
Also Read: విశాఖలో జగన్ సర్కార్ పంజా..టీడీపీ నేతల ఆక్రమణలపై ఉక్కుపాదం
తాను ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి తరుఫున ఓ కేసు వాదించానని.. కాబట్టి ఇప్పుడు జగన్ పై కేసును తాను విచారించడం సముచితం కాదని ఆయన కేసు విచారణ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. సీజేఐ ఎస్ఏ బాబ్డేతో సంప్రదించిన తరువాత ఈ కేసును తగిన బెంచ్ కు లిస్ట్ చేయాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రీకి జస్టిస్ ఉమేశ్ సూచించారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
సుప్రీంకోర్టులో సీజేఐ తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిపై ఆరోపణలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసి.. దాన్ని మీడియాకు బయటపెట్టిన నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది.