https://oktelugu.com/

అశోక్ గజపతిరాజుకు మరో షాకిచ్చిన ఏపీ సర్కార్

ఇది వైసీపీ ప్రభుత్వం.. పైగా అక్కడున్న వైఎస్ జగన్. పగతో రగిలిపోతున్న బొమ్మాళి అంటూ ఇప్పటికే టీడీపీ నేతలను వేటాడిస్తున్నారు. తన ప్రభుత్వంలో ఇంకా టీడీపీ నేతల పెత్తనం ఏంటంటూ వారిని ఏరివేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుల కుటుంబంలో ఇప్పటికే సంచయితను తీసుకొచ్చి చిచ్చుపెట్టిన జగన్ సర్కార్ తాజాగా మరింత పెట్రోల్ పోసింది. అశోక్ గజపతి చేతిలో ఉన్న 104 ఆలయాలను కూడా చేజిక్కించుకొని సంచయిత చేతిలో పెట్టింది. ఇంకేముంది గజపతిరాజుల కుటుంబంలో […]

Written By: , Updated On : November 16, 2020 / 05:39 PM IST
Follow us on

Ashok Gajapatiraju

ఇది వైసీపీ ప్రభుత్వం.. పైగా అక్కడున్న వైఎస్ జగన్. పగతో రగిలిపోతున్న బొమ్మాళి అంటూ ఇప్పటికే టీడీపీ నేతలను వేటాడిస్తున్నారు. తన ప్రభుత్వంలో ఇంకా టీడీపీ నేతల పెత్తనం ఏంటంటూ వారిని ఏరివేస్తున్నారు. టీడీపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుల కుటుంబంలో ఇప్పటికే సంచయితను తీసుకొచ్చి చిచ్చుపెట్టిన జగన్ సర్కార్ తాజాగా మరింత పెట్రోల్ పోసింది. అశోక్ గజపతి చేతిలో ఉన్న 104 ఆలయాలను కూడా చేజిక్కించుకొని సంచయిత చేతిలో పెట్టింది. ఇంకేముంది గజపతిరాజుల కుటుంబంలో మరో కొట్లాట మొదలైంది.

Also Read: చీఫ్ జస్టిస్ కు లేఖ: జగన్ కోర్టు ధిక్కరణ కేసులో భారీ ట్విస్ట్

ఏపీలో ప్రభుత్వం మారాక విజయనగరం రాజు చేతిలోని మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయ చైర్మన్ పదవుల్లో ఉన్న అశోక్ గజపతిరాజును ఈ బాధ్యతల నుంచి తప్పించి సంచయితను వారసురాలిగా నియమించి చైర్మన్ గా చేశారు. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 27న ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా సంచయితను మరో 104 ఆలయాలకు కూడా చైర్ పర్సన్ గా ఏపీ ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా ఉన్న అశోక్ గజపతిరాజును తొలగించింది.

Also Read: ఇక బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్మాయం కాదా?

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక పదవి కట్టబెట్టింది. అదే సమయంలో అశోక్ గజపతిరాజుకు గట్టి షాక్ ఇచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు చైర్ పర్సన్ గా సంచయితను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 2న దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దుర్గాప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖపట్నం జిల్లా సింహాచలం ఆలయంతోపాటు తూర్పు గోదావరి జిల్లాలోని 104 ఆలయాలకు గతంలో చైర్మన్ గా సంచయిత తండ్రి ఆనందగజపతిరాజు వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన సోదరుడు, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చైర్మన్ గా కొనసాగారు.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయం

కాగా తనను తొలగించడంపై అశోక్ గజపతిరాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థానంలో సంచయితను నియమించడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వు అర్ధరాత్రి జీవోలకు నిదర్శమని విమర్శించారు.