Kamal Haasan
Kamal Haasan : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నరుడిగా ఆయన చాలా సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి తనదైన సేవలను అందిస్తూ వస్తున్నాడు. అయితే తమిళ్ తో పాటు ఆయనకు తెలుగులో కూడా భారీ మార్కెట్ అయితే క్రియేట్ అయింది. తన కెరియర్ మొదటి నుంచే ఆయన చేస్తున్న సినిమాలను తమిళ్ తో పాటు తెలుగులో కూడా డబ్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండేవారు.
వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్న హీరో కమల్ హాసన్…ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేసి మన ప్రేక్షకులకు కూడా చాలా దగ్గరయ్యాడు… ఎంతలా అంటే ఇక్కడ స్టార్ హీరోకి ఎంత గుర్తింపైతే ఉంటుందో కమల్ హాసన్ కి కూడా అంతే గుర్తింపు ఉంటుంది. అంతటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్న ఆయన గత కొన్ని రోజుల నుంచి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోతున్నాడు. మధ్యలో విక్రమ్ సినిమాతో ఒక సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నప్పటికి ఆ తర్వాత వచ్చిన భారతీయుడు 2 సినిమాతో మరోసారి డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ షో కి గత ఏడు సీజన్ల నుంచి తనే హోస్ట్ గా వ్యవహరించినప్పటికి ఆయన ఆ షో ను చాలా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడం లో చాలా వరకు కృషి చేశాడు. ఇక ఇప్పుడు ఎనిమిదోవ సీజన్ లో మాత్రం అతని ప్లేస్ లో విజయ్ సేతుపతి చేయాల్సి వస్తుంది. దానికి గల కారణం ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
నిజానికి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవ్వడానికి ముందే కమల్ హాసన్ తను బిగ్ బాస్ సీజన్ 8 చేయలేనని తన అభిమానులతో పాటు బిగ్ బాస్ యాజమాన్యానికి చెప్పి ఒక లేఖ రాసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. నిజానికి ఆయన బిగ్ బాస్ సీజన్ 8 చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న సినిమా కమిట్ మెంట్స్, అలాగే ఇక ఏజ్ కూడా బాగా పెరిగిపోతోంది.
కాబట్టి ఇప్పుడు ఆయన అటు, ఇటు రెండిటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను అనే ఉద్దేశ్యంతోనే బిగ్ బాస్ సీజన్ 8 చేయకూడని నిర్ణయం తీసుకున్నట్టు లేఖ లో తెలియజేశాడు. ఇక దానికి తోడుగా ఆయన ప్రొడక్షన్ హౌజ్ ని కూడా నడిపిస్తున్నాడు. ఇక ఆ బాధ్యత మొత్తాన్ని మరో వ్యక్తి చూసుకున్నప్పటికి దాని మీద కూడా ఆయన ఓ కన్ను వేసి ఉంచాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ క్రమం లోనే ఆయనకి తెలియకుండానే మూడు భాద్యతలు వచ్చి అతని మీద పడ్డాయి కాబట్టి ఈ ఏజ్ లో మూడు రకాల బాధ్యతలను కొనసాగించడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టే ఆయన బిగ్ బాస్ సీజన్ 8కి పుల్ స్టాప్ పెట్టాడు. అంతే తప్ప అతనికి యాజమాన్యానికి ఎలాంటి గొడవలు అయితే జరగలేదు…
తమిళ్ బిగ్ బాస్ స్టార్టింగ్ నుంచి 7 సీజన్ల వరకు సూపర్ సక్సెస్ సాధించడానికి కమల్ హాసన్ చాలా వరకు ప్రయత్నం అయితే చేశాడు. ఈ షో ఆయన వల్లే సక్సెస్ అయిందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… కమల్ హాసన్ కంటెస్టెంట్స్ ఎవరు తప్పు చేసినా కూడా నిలదీస్తూ అడిగేవాడు. కావాలంటే వాళ్ళ మీదకి కోపానికి కూడా వచ్చి వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టేవాడు. అందుకే ఆ షో చాలా జెన్యూన్ గా సాగింది. కమల్ హాసన్ కూడా చాలా జన్యున్ గా హోస్టింగ్ చేశాడు. ఆయన ఎవరి పక్షాన నిలవకుండా అందరిని ఒకే రకంగా చూసుకుంటూ వచ్చాడు. కాబట్టే ఆ ఏడు సీజన్స్ సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆ షో చాలా పాపులారిటిని సంపాదించుకుంది…