Anushka Shetty: మన టాలీవుడ్ లో అందం మరియు అభినయం రెండు ఉన్నా అతి తక్కువ మంది హీరోయిన్స్ లో అనుష్క కూడా ఒక్కరు..అక్కినేని నాగార్జున తెరకెక్కించిన సూపర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయినా అనుష్క ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి సౌత్ ఇండియా లో లేడీ సూపర్ స్టార్ ఇమేజి ని సొంతం చేసుకుంది..నేటి తరం హీరోయిన్స్ లో ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ లాగ మారిన అనుష్క ఇప్పుడు మెల్లిగా సినిమాలు చేసే సంఖ్య బాగా తగ్గించేసింది..ఆమె అకస్మాత్తుగా సినిమాలు చెయ్యడం తగ్గించడానికి కారణం ఆమె బరువే..ఎంత ప్రయత్నం చేసిన ఆమె తన బరువు ని తగ్గించుకోలేకపోతుంది అట..అందుకే చేతినిండా అవకాశాలు వస్తున్నా కూడా వదులుకోవాల్సి వస్తుంది..2018 వ సంవత్సరం లో విడుదల అయినా బాగమతి సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు..ఇక చాలా కాలం విరామం తీసుకొని ఆమె చేసిన నిశబ్దం అనే సినిమా OTT లో విడుదల అయ్యి పూర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.
Also Read: Singer KK : సినీ పరిశ్రమలో విషాదం.. పాట పాడుతూ ప్రముఖ సింగర్ ఇలా హఠాన్మరణం.. వీడియో
ఈ సినిమా తర్వాత ఆమె UV క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పోలిశెట్టి హీరో గా తెరెకెక్కే ఒక్క సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నా సంగతి మన అందరికి తెలిసిందే..పీ.మహేష్ దర్సకత్వం వహించే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే నవీన్ పోలిశెట్టి కి సంబంధించి కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసారు..కానీ అనుష్క మాత్రం ఇప్పటి వరుకు ఈ సినిమా సెట్స్ లోకి అడుగుపెట్టలేదు అట..దానికి కారణం ఆమె బరువు తగ్గలేకపోవడమే..ఈ కాలం లో బరువు తగ్గడానికి లైపోసెక్షన్ వంటి ఆపరేషన్స్ ఎన్ని ఉన్న కూడా అనుష్క ఆ పద్దతి లో తగ్గడానికి ఇష్టపడడం లేదు అట..సాధారణ పద్ధతులలోనే బరువు తగ్గి త్వరలోనే సెట్స్ లో కి అడుగుపెడుతాను అని దర్శక నిర్మాతలకు చెప్పిందట అనుష్క..డీఐతో ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది..జాతి రత్నాలు వంటి సెన్సషనల్ హిట్ తర్వాత నవీన్ పోలిశెట్టి చేస్తున్న రెండు సినిమాలలో ఇది ఒక్కటి..ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి 27 ఏళ్ళ అబ్బాయిగా నటిస్తుండగా, అనుష్క 37 ఏళ్ళ ఆంటీగా నటిస్తుంది అట..పదేళ్లు తేడా ఉన్న ఈ ఇద్దరు ప్రేమించుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురు అవుతాయి అనేదే ఈ సినిమా స్టోరీ అట..విభిన్నమైన కధాంశం తో తెరకెక్కుతున్న ఈ సినిమా నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలవబోతుంది అట ఈ సినిమా.
Also Read: Economic Growth: భారత్ ఆర్థిక వృద్ధి ఎందుకు ఆగిపోయింది? అడ్డంకులు ఏమిటీ?