Redmi Note 14 SE 5G Price: స్మార్ట్‌ఫోన్ లవర్స్ కు షియోమీ గుడ్ న్యూస్ అందించింది. రెడ్ మీ నోట్ 14 సిరీస్‌లో అత్యంత చవకైన, అడ్వాన్సుడ్ మోడల్‌గా రెడ్ మీ నోట్ 14 SE 5G ని రీసెంటుగా లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకోవడం ఖాయం. రెడ్ మీ నోట్ 14 SE 5G ఫోన్‌లో 6.67-అంగుళాల భారీ AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. కాబట్టి స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. సూర్యరశ్మిలో కూడా స్పష్టంగా కనిపించేలా 2100 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. అంతేకాదు, డిస్‌ప్లేకు రక్షణగా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఫోన్‌ను ఈజీగా, సురక్షితంగా అన్‌లాక్ చేయడానికి ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఇందులో ఉంది.
Also Read: ఇది ఫోన్ కాదు.. ఫోటో స్టూడియో.. వీవో V60 5Gతో అదిరిపోయే AI ఎడిటింగ్
ధర విషయానికి వస్తే.. రెడ్ మీ నోట్ 14 SE 5G ధర రూ.14,999. అయితే, అన్ని బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఎక్స్ ట్రా డిస్కౌంట్ కూడా ఉంది. అప్పుడు ఈ ఫోన్ కేవలం రూ.13,999కే లభిస్తుంది. ఈ ఫోన్ ఆగస్టు 7, 2025 నుంచి Mi.com, Flipkart.com వెబ్‌సైట్‌లలో, అలాగే షియోమీ రిటైల్ స్టోర్‌లు, కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉంటుంది.
రెడ్ మీ నోట్ 14 SE 5G క్రిమ్సన్ ఆర్ట్ అనే అట్రాక్టివ్ కలర్లో, 6GB ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది. ఎంటర్ టైన్మెంట్ కోసం ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. ఇంకా, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉండడం కలిసొచ్చే విషయం. కెమెరా విషయానికి వస్తే, రెడ్ మీ నోట్ 14 SE 5G వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ సోనీ LYT-600 మెయిన్ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో వస్తుంది. కాబట్టి మీరు కదిలినా కూడా క్లియర్ ఫోటోలు తీయవచ్చు. దీనికి తోడు, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్, మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి.
Also Read: అనిల్ రావిపూడి – చిరంజీవి కాంబోలో వస్తున్న సినిమా కథేంటో తెలిసిపోయిందిగా…
ఈ ఫోన్‌లో 5110 mAh బ్యాటరీ ఉంది, కాబట్టి ఒకసారి ఛార్జ్ చేస్తే చాలాసేపు వాడుకోవచ్చు. అలాగే, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. రెడ్ మీ నోట్ 14 SE 5G తో పాటు రెడ్ మీ నోట్ 14 సిరీస్‌లోని ఇతర మూడు స్మార్ట్‌ఫోన్‌లు – రెడ్ మీ నోట్ 14 Pro+ 5G, రెడ్ మీ నోట్ 14 Pro 5G, రెడ్ మీ నోట్ 14 5G – అన్నీ కూడా స్థానికంగా భారతదేశంలోనే ఉత్పత్తి చేసినట్లు షియోమీ ప్రకటించింది. ఇది భారత ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకునే వారికి ఈ రెడ్ మీ నోట్ 14 SE 5G ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.