Pawan Kalyan: కల్కి నిర్మాత అశ్వినీ దత్ చేసిన కామెంట్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇమేజ్ డ్యామేజ్ చేశాయి. కల్కి టికెట్ రూ. 1000 రూపాయలకు పెంచాల్సిందని పవన్ కళ్యాణ్ అన్నట్లు అశ్వినీ దత్ కామెంట్స్ ఉన్న నేపథ్యంలో విమర్శలు తలెత్తాయి. ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడింది. ఈ క్రమంలో టాలీవుడ్ నిర్మాతలు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్-అశ్వినీ దత్ మధ్య చర్చలు జరిగాయి.
తాజా ఇంటర్వ్యూలో అశ్వినీ దత్ మాటల్లో మాటగా కల్కి టికెట్స్ ధరలు వెయ్యి రూపాయలకు పెంచాల్సిందని పవన్ కళ్యాణ్ సూచించారని అన్నారు. అశ్వినీ దత్ కామెంట్స్ విని అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పటికే సామాన్యుడు కుటుంబంతో పాటు సినిమా థియేటర్ కి వెళ్లే పరిస్థితి లేదు. అలాంటిది టికెట్ వెయ్యి రూపాయలు చేస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చేశారు. అలాగే అలాంటి సూచన చేసిన పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు.
అశ్వినీ దత్ కామెంట్స్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారన్నట్లు ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఏమిటో వివరించారు. ఢిల్లీ, ముంబైలో మాదిరి రూ. 1000-1500లతో ఫ్లెక్సీ ప్రైసింగ్ పెడితే బాగుండు అన్నారు. అది మనకు వర్క్ అవుట్ కాదని మేము ప్రతిపాదన తిరస్కరించాము. కొందరు అనవసరమైన అపోహలు సృష్టిస్తున్నారు.
ప్రతిసారి టికెట్స్ ధరల పెంపుకు ప్రభుత్వాల వద్దకు రాకుండా బడ్జెట్ ఆధారంగా ఫ్లెక్సీ ప్రైసింగ్ పెట్టాలి అనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. అంతే కానీ విపరీతంగా టికెట్స్ ధరలు పెంచాలి అనేది కాదని అన్నారు. ఏపీ ప్రభుత్వం టికెట్స్ ధరల పై అందరికీ ప్రయోజనం చేకూర్చేలా విధి విధానాలు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడని అశ్వినీ దత్ అన్నారు. ప్రస్తుతం ఆయన కల్కి సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. కల్కి వరల్డ్ వైడ్ వసూళ్లు రూ. 800 కోట్లను దాటేశాయి.