https://oktelugu.com/

Discount Offer on Cars: ఈ కారుపై రూ.1.03 లక్షల డిస్కౌంట్.. జూలై 15 లోపే.. త్వరపడండి

Discount Offer on Cars: మారుతి కంపెనీకి చెందిన బాలెనో బెస్ట్ సీఎన్ జీ కారుగా నిలుస్తోంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై మొత్తం 57 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 6, 2024 / 11:55 AM IST

    Discount Offer on Cars

    Follow us on

    Discount Offer on Cars: ప్రస్తుత కాలంలో సొంత కారు ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో లోబడ్జెట్ , డిస్కౌంట్ వచ్చే కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయి. కానీ కొన్ని కార్ల కంపెనీలు సేల్స్ పెంచుకునేందుకు సాధారణ రోజుల్లో కూడా తగ్గంపు ధరతో విక్రయిస్తుంటాయి. తాజాగా మారుతి కంపెనీకి చెందిన కొన్ని కార్లపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించాయి. అయితే ఈ ఆఫర్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 15 వరకు గడువు ఉండనుంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మారుతి కంపెనీకి చెందిన బాలెనో బెస్ట్ సీఎన్ జీ కారుగా నిలుస్తోంది. ఈ కారు ధర ప్రస్తుతం రూ.6.66 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. దీనిపై మొత్తం 57 వేల డిస్కౌంట్ ను పొందవచ్చు. ఇందులో నగదు డిస్కౌంట్ రూ.40 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ రిటర్న్స్ రూ.2,100 ఉన్నాయి.

    ఇదే కంపెనీకి చెందిన గ్రాండ్ విటారా పై లక్షకు పైగా ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో రూ. 50 వేలు నగదు డిస్కౌంట్, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.50 వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.3,100 ఉన్నాయి. మొత్తంగా రూ.1.03 లక్షల వరకు డిస్కౌంట్ పొందుతారు. ప్రస్తుతం దీనిని రూ.11 లక్షలతో విక్రయిస్తున్నారు.

    మహీంద్రా థార్ కు పోటీగా మారుతి జిమ్నీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ కారుపై డిస్కౌంట్ ను ప్రకటించారు. ప్రస్తుతం దీనిని రూ.12.74 లక్షలతో విక్రయిస్తుండగా రూ.2.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందించనున్నారు. అయితే ఈ డిస్కౌంట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే వర్తిస్తుంది.

    సియాజ్ కారు ధర మార్కెట్లో రూ.9.4 లక్షలుగా ఉంది. దీనిపై రూ.48 వేల ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో నగదు డిస్కౌంట్ రూ.20 వేల వరకు అందిస్తున్నారు. అలాగే రూ.25 వేల ఎక్చేంజ్ బోనస్, రూ.3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు.

    మారుతి ఇగ్నిస్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మార్కెట్లో రూ.5.84 లక్షలతో అమ్మకానికి సిద్ధంగా ఉంది. అయితే దీనిపై రూ.55 వేల డిస్కౌంట్ ను ప్రకటించారు. ఇందులో ఎక్చేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, నగదు డిస్కౌంట్ రూ.40 వేల వరకు అందించనున్నారు.

    ఎక్స్ ఎల్ 6 కారుపై ఆఫర్లు ప్రకటించారు. దీనిని కొనుగోలుచేసిన వారికి రూ.40 వేల ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇందులో నగదు డిస్కౌంట్ రూ.20 వేలు, ఎక్చేంజ్ బోనస్ కింద రూ.20 వేలు అందించనున్నారు. ప్రస్తుతం దీనిని రూ.11.51 లక్షలతో విక్రయిస్తున్నారు.