https://oktelugu.com/

Kane Williamson: కేన్ విలియంసన్ నిర్ణయం వెనుక.. కారణం అదేనా?

కేన్ విలియం సన్ నిర్ణయం వెనక అసలు కారణం వేరే ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ లీగ్ దశ నుంచే ఇంటికి వచ్చేసింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 19, 2024 / 05:49 PM IST

    Kane Williamson

    Follow us on

    Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియంసన్ తీసుకున్న నిర్ణయం క్రికెట్ చరిత్రలో సంచలనంగా మారింది. ఇప్పటికే విలియంసన్ న్యూజిలాండ్ టెస్ట్ పగ్గాలను వదిలిపెట్టాడు.. అంతేకాదు వన్డే, టి20 ఫార్మాట్ లోనూ సారధిగా ఉండబోనని స్పష్టం చేశాడు. 2024 -25 కి సంబంధించిన న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్టు కూడా తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశాడు. ఎండాకాలంలో పలు ప్రాంతాలలో ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్ లకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల, సెంట్రల్ కాంట్రాక్ట్ వద్దనుకున్నట్టు కేన్ విలియంసన్ స్పష్టం చేశాడు.

    కేన్ విలియం సన్ నిర్ణయం వెనక అసలు కారణం వేరే ఉందని క్రికెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ లీగ్ దశ నుంచే ఇంటికి వచ్చేసింది. ఐసీసీ నిర్వహించిన టి20 వరల్డ్ కప్ లో లీగ్ దశలోనే న్యూజిలాండ్ ఇంటికి రావడం ఇదే తొలిసారి. దశాబ్దం క్రితం న్యూజిలాండ్ జట్టు ఇలానే ఓ ఐసీసీ టోర్నీలో గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చింది. అమెరికా – వెస్టిండీస్ జట్ల వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ జట్ల చేతిలో దారుణమైన ఓటములు ఎదుర్కొంది. ఉగాండా, పపువా న్యూ గినియా జట్లపై ఓదార్పు విజయాలు మాత్రమే సాధించింది.

    కేన్ విలియంసన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మాజీ క్రికెటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ” ఇలాంటి నిర్ణయం కేన్ విలియం సన్ నుంచి ఊహించలేదు. ఆలోచిస్తే దీని వెనక ఏదో ఉన్నట్టు అర్థమవుతుందని” మాజీ క్రీడాకారులు వ్యాఖ్యానిస్తున్నారు.. మరోవైపు ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే కేన్ విలియం సన్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ” అతడికి జాతీయ జట్టు వద్దు. డబ్బులు ఇచ్చే ఫ్రాంచైజీ జట్లే ముద్దు. ఇకపై ఎండాకాలంలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు అతడు అందుబాటులో ఉండడు. ఈ మాటలు అతడే పరోక్షంగా చెబుతున్నాడు.. ఇక దీనిని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిదని” హర్షా భోగ్లే పేర్కొన్నాడు.