https://oktelugu.com/

Kalki 2898 AD: కల్కి లో గూస్ బాంబ్స్ తెప్పించే సీన్స్ ఇవేనట…

ఈ సినిమాలో ఈ మూడు మాత్రం భారీ హైలెట్ గా నిలవబోతున్నాయని సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి ఇవి ఏ రేంజ్ లో ఉంటాయి అనేది తెలియాలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

Written By:
  • Gopi
  • , Updated On : June 25, 2024 / 08:29 AM IST

    Kalki 2898 AD

    Follow us on

    Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ సినిమాలో నాగ్ అశ్విన్ తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రభాస్ కూడా మరోసారి స్టార్ స్టేటస్ ని అందుకోవాలంటే ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అయ్యి తీరాలి.

    కాబట్టి ఎలాగైనా సరే వీళ్ళు ఈ సినిమాతో సక్సెస్ ని కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఈనెల 27వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపథ్యంలో ఈ సినిమా మీద పలు వార్తలైతే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని సీన్లు హైలైట్ గా నిలువబోతున్నాయట అవి ఏంటి అంటే ప్రభాస్ అమితాబచ్చన్ లా మధ్య నడిచే ఫైట్ సీక్వెన్స్ ఒకటైతే, ప్రభాస్ కల్కి ని కాపాడే మరొక ఎపిసోడ్, అలాగే క్లైమాక్స్ ఫైట్ సీక్వెన్స్…

    ఈ సినిమాలో ఈ మూడు మాత్రం భారీ హైలెట్ గా నిలవబోతున్నాయని సినిమా యూనిట్ నుంచి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. మరి ఇవి ఏ రేంజ్ లో ఉంటాయి అనేది తెలియాలంటే ఈనెల 27వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా బుక్ మై షో లో ఈ సినిమా టికెట్లను పెడితే పెట్టిన కొద్ది క్షణాల్లోనే టికెట్లు మొత్తం అమ్ముడుపోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

    ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని నాగ్ అశ్విన్ మరొక్కసారి క్రాస్ చెక్ చేసుకొని చూశారట. ఈ సినిమా తనకు పూర్తి సాటిస్ఫాక్షన్ అనిపించిందట. అందుకే దీనికి ప్యాచ్ వర్క్స్ లేమి లేకుండా ముందే ఫినిష్ చేసి పెట్టాడట. ఇక గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమా రిలీజ్ అనేది లేట్ అవుతూ వచ్చింది…