https://oktelugu.com/

Kamal Haasan: 15 రోజుల గ్యాప్ లోనే రెండు డిఫరెంట్ గెటప్ లు.. కమల్ కు ఇది ఎఫెక్ట్ యేనా?

గత కొన్ని రోజుల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా సక్సెస్ ని కొట్టాలనే ఉద్దేశ్యంతో 1996లో ఆయన తీసిన 'భారతీయుడు ' సినిమాకి సీక్వల్ గా 'భారతీయుడు 2' అనే సినిమాని తెరకెక్కించాడు.

Written By: , Updated On : June 25, 2024 / 09:02 AM IST
Kamal Haasan

Kamal Haasan

Follow us on

Kamal Haasan: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ చాలా కాలం పాటు గుర్తింపు పొందిన శంకర్ ఒకప్పుడు వరుస విజయాలను అందుకుంటూ తమిళ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ముందుకు సాగాడు. ఇక అప్పట్లో ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది తప్పకుండా విజయాన్ని సాధిస్తుంది అనేంతలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక గత కొన్ని రోజుల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే లేదు. కాబట్టి ఈసారి ఎలాగైనా సక్సెస్ ని కొట్టాలనే ఉద్దేశ్యంతో 1996లో ఆయన తీసిన ‘భారతీయుడు ‘ సినిమాకి సీక్వల్ గా ‘భారతీయుడు 2’ అనే సినిమాని తెరకెక్కించాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకుడిలో మంచి అంచనాలు పెంచేస్తున్నప్పటికీ సినిమా నుంచి ట్రైలర్ అయితే ఇంకా రాలేదు. ట్రైలర్ వచ్చినట్లయితే సినిమా మీద అంచనాలు తారా స్థాయిలో పెరగడం పక్క అంటూ సినిమా యూనిట్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

ఇక అలాగే ఈ సినిమాని వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన కమలహాసన్ కల్కి సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవ్వడం వల్ల కమలహాసన్ కెరియర్ కి ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒక సినిమాలో విలన్ గా మరొక సినిమాలో హీరోగా నటించిన ఆయన కెరీర్ మీద చాలా వరకు ఇంపాక్ట్ చూపించే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించిన కమలహాసన్ కల్కి సినిమాలో విలన్ గా ఒక డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే భారతీయుడు 2 సినిమాలో కూడా కమలహాసన్ ముసలి లుక్ లో కనిపించనున్నాడు. అయితే ఒకే సమయంలో రెండు డిఫరెంట్ లుక్ ల్లో కనిపిస్తున్న కమలహాసన్ ఈ సినిమాల ద్వారా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…