https://oktelugu.com/

Kalki Movie: అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న కల్కి సినిమా…

Kalki Movie: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉండడమే కాకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తో తీసి ఆ సినిమాకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చారు.

Written By:
  • Gopi
  • , Updated On : July 2, 2024 / 10:46 AM IST

    Kalki movie got a rare honor

    Follow us on

    Kalki Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈమధ్య గ్రాఫికల్ ఓరియంటెడ్ సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలను ఎక్కువగా ఇష్టపడిన జనాలు వాళ్ళ అభిరుచిని మార్చుకున్నారు. హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉన్న సినిమాలను చేస్తే చూసి ఆనందించడానికి ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడానికి వాళ్ళు ఎప్పుడు ముందు వరుసలో ఉంటున్నారు.

    ఇక ఈ ట్రెండు కు తెరతీసింది మాత్రం రాజమౌళి అనే చెప్పాలి. ఆయన తీసిన బాహుబలి సినిమా ఒక విజువల్ వండర్ గా తెరకెక్కింది. ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు కూడా గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ గా తెరకెక్కినప్పటికీ అందులో కొన్ని సక్సెస్ అయితే మరి కొన్ని ఫెయిల్యూర్ గా మిగిలాయి. కానీ ఇప్పుడు మాత్రం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమాలో గ్రాఫిక్స్ ప్రాధాన్యం ఉండడమే కాకుండా ఎక్కడ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తో తీసి ఆ సినిమాకి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చారు. ఇక బాహుబలి సినిమా ఎలాంటి విజువల్స్ తో అయితే తెరకెక్కిందో ఈ సినిమా కూడా అలాంటి విజువల్స్ తోనే తెరకెక్కింది.

    నిజానికి ఈ సినిమా విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే కల్కి సినిమా ఇప్పుడు బాహుబలి సినిమా పక్కన నిలిచిందనే చెప్పాలి. ఇక మరొక రకంగా చెప్పాలంటే తెలుగు సినిమా స్టాండర్డ్ ని పెంచిన సినిమాల్లో కల్కి సినిమా టాప్ 2 లో ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మన వాళ్లు కూడా గ్రాఫిక్స్ తో వండర్స్ ని క్రియేట్ చేయొచ్చు అని చెప్పడానికి కల్కి సినిమా ఒక ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు.

    ఇక ఏ సినిమా అయినా కూడా రాజమౌళి తీస్తేనే ఆ సినిమా భారీ సక్సెస్ అవుతుందని చాలామంది నమ్మేవారు. కానీ యంగ్ డైరక్టర్ అయిన నాగ్ అశ్విన్ కూడా ఆ సినిమాని ఈజీగా టేక్ ఆఫ్ చేయడంతో ఇప్పుడు వచ్చే మరికొంత మంది దర్శకులను కూడా ప్రొడ్యూసర్స్ నమ్మి సినిమాలు చేసే ఆస్కారం ఉందనే చెప్పాలి…