Kalki Box Office Collections: ప్రభాస్ మరోసారి సినీ ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టాడు. ఆయన గతంలో నటించిన ‘బాహుబలి’ ద్వారా కోట్ల కలెక్షన్లు రాబట్టి చిత్ర పరిశ్రమను షేక్ చేశాడు. ఇప్పుడు ‘కల్కి ఏడీ 2898’తో మరోసారి కాసుల వర్షం కురిపించాడు. జూలై 27న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ మూవీ ఒక్కరోజే రూ.200 కోట్లు వసూలైనట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆయన సినిమా బహుబలి ఈ రికార్డు కొట్టగా మరోసారి కల్కితో ప్రభాస్ సినీ నిర్మాతల పంట పండిచాడు. దీంతో ప్రభాస్ కాస్లీ హీరోగా మారిపోయాడు. ఇంతకీ ఈ మూవీకి కలెక్షన్లు ఏ విధంగా వచ్చాయో చూద్దాం..
నాగ్ అశ్వన్ డైరెక్షన్లో వచ్చిన ‘కల్కి ఏడీ 2898’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా జూలై 27న రిలీజ్ అయింది. కలియుగానికి, పురాణానికి లింక్ పెట్టి తీసిన ఈ మూవీలో విజువల్స్, టెక్నాలజీతో ఆద్యంతం ఆకట్టుకుంది. ఇందులో ముఖ్యంగా బహాభారతం సీన్స్ చాలా బాగున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా మొత్తంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ ల మధ్య జరిగే సీన్స్ ఆకట్టుకున్నాయి. ఒక చరిత్రను టెక్నాలజీతో ఇంత బాగా తీయోచ్చా? అన్న విధంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నాగ్ అశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
కల్కి మూవీ నిర్మాణానికి దాదాపు 600 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. అయితే ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజు భారతదేశ వ్యాప్తంగా రూ.95 కోట్లు వసూలైనట్లు తెలుస్తోంది. గ్రాస్ కలెక్షన్ 118 కోట్లు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి 180 కోట్లు వసూలైనట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికగా కలెక్షన్లు తెచ్చిన మూడవ చిత్రంగా రికార్డుల్లోకెక్కింది. భారత్ లో ఇప్పటి వరకు రాజమౌళి మూవీ ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే 223 కోట్లు వసూలైంది. ఆ తరువాత బాహుబలి తొలిరోజు రూ.217 కోట్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కల్కి రూ.180 కోట్లు సాధించింది.
భారత్ విషయానికొస్తే ఫస్ట్ డే కలెక్షన్లు కేజీఎఫ్ 2 రూ.150 కోట్లు, సలార్ రూ.158 కోట్లు, లియో రూ.142 కోట్లు, సాహో రూ.130 కోట్లు, జవాన్ రూ.129 కోట్లు వసూలైంది. ఆ తరువాత ఇప్పుడు కల్కి చేరింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీకి ఎక్కువ ఆదరణ ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలోని విజువల్స్, టెక్నాలజీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కొత్త తరహాలో సినిమా ఉండడంతో ప్రేక్షకులు బాగా లైక్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పోస్టులు పెడుతున్నారు.