Kalki: కల్కి 2829 AD చిత్ర విడుదలకు సమయం దగ్గర పడుతుంది. మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ కోసం దాదాపు రూ. 200 కోట్లు ఖర్చు చేస్తున్నారని సమాచారం. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇటీవల నిర్వహించిన ఈవెంట్ ఖర్చు రూ. 40 కోట్లు పైమాటే అంటున్నారు. అదే స్థాయిలో మరో మూడు భారీ ఈవెంట్స్ దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్వహించనున్నారట. సినిమాపై ఆడియన్స్ లో హైప్ తెచ్చేందుకు యూనిట్ విపరీతంగా కష్టపడుతున్నారు.
అసలు బుజ్జి హడావుడి ఎక్కువైపోయింది. కల్కి చిత్రంలో ప్రభాస్(Prabhas) పాత్ర పేరు భైరవ. అతడి వాహనమే బుజ్జి(Bujji). ఈ మూడు చక్రాల కారును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. దేశంలోని ఉత్తమ ఇంజనీర్స్ దాని నిర్మాణంలో భాగం అయ్యారు. కథలో బుజ్జి వాహనానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలియదు కానీ బుజ్జిని విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు. ఆల్రెడీ బుజ్జిని పరిచయం చేస్తూ ఓ ప్రోమో విడుదల చేశారు. బుజ్జి అండ్ భైరవ స్నేహితుల మాదిరి.
Also Read: Vishwambhara: చిరంజీవి విశ్వంభర మూవీ లో గెస్ట్ రోల్ లో నటిస్తున్న స్టార్ హీరో…
భైరవతో బుజ్జి మాట్లాడుతుంది. అతడి ఆదేశాలు పాటిస్తుంది. ఒక్కోసారి విసిగిస్తుంది. సదరు ప్రోమో చూస్తే అర్థం అయ్యింది ఇదే. తాజాగా మరో వినూత్న ప్రమోషన్ కి తెరలేపారు కల్కి పీఆర్ టీమ్. బుజ్జి అండ్ భైరవ టైటిల్ తో స్పెషల్ యానిమేటెడ్ వీడియో రూపొందించారు. ఈ వీడియో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. మే 31న బుజ్జి అండ్ భైరవ వీడియో అందుబాటులోకి వస్తుంది.
Also Read: Nivetha Pethuraj: పోలీసులకు అడ్డంగా బుక్ అయిన హీరోయిన్ నివేద పేతురాజ్… ఆ కారు డిక్కీలో ఏముంది?
ఈ క్రమంలో నేడు ట్రైలర్ విడుదల చేశారు. బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ లో వారిద్దరి అనుబంధాన్ని తెలియజేశారు. యానిమేషన్ వెర్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. ప్రభాస్ డైలాగ్స్ అసలు అర్థం కావడం లేదు. బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ చూశాక బుజ్జి ఎప్పుడూ భైరవతోనే ఉంటుందని తెలుస్తుంది. ఇక ప్రభాస్ వివిధ ప్రపంచాలకు ప్రయాణం చేస్తాడు. ఈ చిత్రాన్ని పురాణాలతో కూడిన సైన్స్ ఫిక్షన్ మూవీ అని చెప్పారు. ఇక మీరు కూడా బుజ్జి అండ్ భైరవ ట్రైలర్ చూసేయండి. కల్కి జూన్ 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.