PM Modi: మోడీ స్టైలే సపరేట్..ఆయన ఏది చేసినా కుంభస్థలాన్ని కొట్టేస్తారు అంతే

మాల్దీవులు అనేక దీపాల సముదాయం. ఆ దేశానికి పర్యాటకమే ఆయువుపట్టు. మాల్దీవులుకు వెళ్లే టూరిస్ట్ లో అత్యధికులు భారతీయులే ఉండేవారు. ఎప్పుడైతే మాల్దీవులు భారత్ తో సఖ్యతను మెయింటెన్ చేయకుండా చైనాకు దగ్గర అయిందో.. అప్పుడే మోడీ ఆ దేశ పర్యాటక ఆదాయంపై దృష్టి పెట్టేశారు.

Written By: Neelambaram, Updated On : May 30, 2024 6:48 pm

PM Modi

Follow us on

PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టైలే సపరేటు. ఆయనేది చేసినా.. కుంభస్థలాన్ని కొట్టడమే టార్గెట్ గా పెట్టుకుంటారు. నేరుగా విషయం,వ్యక్తిని కార్నర్ చేయకుండానే అనుకున్న లక్ష్యానికి మార్గాలను సుగమం చేసుకోగల్గడంలో పీఎం మోడీ దిట్ట. అరేబియా ద్వీప దేశం మాల్దీవులు భారత్ వ్యతిరేక గుప్పెట్లోకి వెళ్లినప్పుడు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనుసరించిన రాజనీతిజ్ఞత ప్రశంసలందుకుంది. మాల్దీవులు డ్రాగన్ కీలుబొమ్మగా మారడంతో..ఆ దేశాన్ని దారికి తెచ్చేందుకు మోడీ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

మాల్దీవులు అనేక దీపాల సముదాయం. ఆ దేశానికి పర్యాటకమే ఆయువుపట్టు. మాల్దీవులుకు వెళ్లే టూరిస్ట్ లో అత్యధికులు భారతీయులే ఉండేవారు. ఎప్పుడైతే మాల్దీవులు భారత్ తో సఖ్యతను మెయింటెన్ చేయకుండా చైనాకు దగ్గర అయిందో.. అప్పుడే మోడీ ఆ దేశ పర్యాటక ఆదాయంపై దృష్టి పెట్టేశారు. ఇండియాను శత్రు దేశంగా భావిస్తున్న మాల్దీవులుకు భారత పర్యాటకులు వెళ్లొద్దని..దానికి ప్రత్యామ్నాయంగా లక్ష దీవులను ఎంచుకునేలా అక్కడ తన పర్యటన కొనసాగించారు. లక్షదీవుల్లోని సముద్రంలో కాసేపు సరదాగా ఈత కొట్టి వాటిని తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై పోస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా భారతీయ పర్యాటకులతో పాటు..ప్రపంచ పర్యాటకుల దృష్టి లక్ష దీవులపై పడింది. ఈ విషయంలో మోడీ కత్తి పట్టకుండానే అనుసరించిన దౌత్య నీతితో ఒక విధంగా మాలే ప్రభుత్వం బెంబేలెత్తిపోయింది.

ఇప్పుడు తాజాగా ఏడు దశల ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా కూడా మోడీ ఇదే స్ట్రాటజీని ఫాలో కావడం గమనార్హం. ఏడు దశల ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఎలక్షన్ క్యాంపెనింగ్ ముగిసిన వెంటనే ఆయన కన్యాకుమారి వెళ్లిపోయారు. దాదాపు 45 గంటల పాటు అక్కడే స్వామి వివేకానంద విగ్రహం వద్ద ధ్యాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే మోడీ చేపట్టిన ఈ కార్యక్రమంపై ఇండియా కూటమి రాజకీయ భాగస్వామిక పక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఎన్నికల ముగిసినప్పటికీ మోడీ ఇలాంటి పొలిటికల్ స్టాంట్లు చేయడమేంటని ప్రశ్నించాయి. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మోడీ హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేశారు. అది అప్పట్లో మీడియాలో బాగా పబ్లిసిటీ వచ్చింది. తాజాగా ఏడో దశ ప్రచార పర్వం ముగిసినప్పటికీ ఆయన ధ్యానం పేరుతో ఎలక్షన్స్ ప్రభావితం చేసేలా ప్రయత్నం చేయడం గమనార్హం. అయితే మోడీ ధ్యానం చేసినప్పటికిని అది ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చే అవకాశాలే లేవు. అయితే మోడీ చేసిన ధ్యానం వల్ల మాత్రం పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలలో ఎన్నికల పోలింగ్ పై ప్రభావం చూపించే అవకాశాలున్నాయి. మొత్తంగా మోడీ ఏది చేసిన పరోక్షంగా ప్రత్యర్థి కుంభస్థలాలను మాత్రం కొట్టగలరని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.