https://oktelugu.com/

Nivetha Pethuraj: పోలీసులకు అడ్డంగా బుక్ అయిన హీరోయిన్ నివేద పేతురాజ్… ఆ కారు డిక్కీలో ఏముంది?

రామ్ పోతినేని రెడ్ మూవీలో నివేద పోలీస్ రోల్ చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. సుశాంత్ కి జంటగా ఆమె నటించారు.

Written By:
  • S Reddy
  • , Updated On : May 30, 2024 / 01:02 PM IST

    Nivetha Pethuraj

    Follow us on

    Nivetha Pethuraj: హీరోయిన్ నివేద పేతురాజ్ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యింది. ఆమె కారును పోలీసులు తనిఖీ చేయాలని అడిగారు. అందుకు ఆమె నిరాకరించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. మెంటల్ మదిలో చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నివేద పేతురాజ్. చిత్రలహరి, బ్రోచేవారెవరురా చిత్రాల్లో ఆమె నటించారు. బ్రోచేవారెవరురా మంచి విజయాన్ని అందుకుంది. శ్రీవిష్ణు ఈ చిత్రంలో హీరోగా నటించాడు.

    రామ్ పోతినేని రెడ్ మూవీలో నివేద పోలీస్ రోల్ చేసింది. దర్శకుడు త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో చిత్రంలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. సుశాంత్ కి జంటగా ఆమె నటించారు. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ కొట్టినప్పటికీ నివేదకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. విశ్వక్ సేన్ కి జంటగా దాస్ కా ధమ్కీ చిత్రం చేసింది. ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.

    దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కించిన ‘భూ’ మూవీలో నివేద పేతురాజ్ ఓ హీరోయిన్ గా చేసింది. రకుల్ ప్రీత్ సింగ్, విశ్వక్ సేన్ ఇతర ప్రధాన పాత్రలు చేశారు. నివేదకు ఆఫర్స్ వచ్చినా కెరీర్ లో ఆశించిన స్థాయికి వెళ్లలేకపోయింది. ఆమెను సెకండ్ హీరోయిన్ గానే దర్శక నిర్మాతలు చూస్తున్నారు. లేదంటే చిన్న హీరోల సరసన ఆఫర్స్ వస్తున్నాయి.

    ఇదిలా ఉంటే నివేద పేతురాజ్ సంచలన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె కారులో వెళ్తుండగా పోలీసులు ఆపారు. ఆమె కారును చెక్ చేయాలి అన్నారు. అందుకు నివేద అంగీకరించలేదు. అర్థం చేసుకోండి, నన్ను వెళ్లనివ్వండని రిక్వెస్ట్ చేసింది. లేదు మీరు కారు ట్రంక్ ఓపెన్ చేయండి. మా పని మేము చేసుకుంటాము అన్నారు. కారు ట్రంక్ ఓపెన్ చేయడం కుదరదని ఆమె తెగేసి చెప్పింది. వీడియో తీస్తుంటే కోపంగా ఫోన్ తీసుకుని విసిరేసింది. అసలు ఆమె కారు డిక్కీ లో ఏముంది? ఆమె ఎందుకు కారును చెక్ చేయడానికి ఒప్పుకోలేదనే సందేహాలు మొదలయ్యాయి.