Vishwambhara: చిరంజీవి విశ్వంభర మూవీ లో గెస్ట్ రోల్ లో నటిస్తున్న స్టార్ హీరో…

వశిష్ట లాంటి డైరెక్టర్ తో చిరంజీవి డైరెక్ట్ గా సినిమా చేస్తానని ఒప్పుకొవడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు.

Written By: Gopi, Updated On : May 30, 2024 4:54 pm

Vishwambhara

Follow us on

Vishwambhara: తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు 40 సంవత్సరాలపాటు ఏకఛత్రాధిపత్యంతో ఏలుతున్న ఒకే ఒక్కరు చిరంజీవి… ఈయన నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందడమే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించుకోవడానికి దోహదపడ్డాయి. అలాంటి చిరంజీవి ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో కూడా ‘విశ్వంభర ‘ అనే ఒక భారీ చిత్రంలో నటిస్తూ ప్రేక్షకులందరిని మెప్పించడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాడు.

అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక చిరంజీవి ఈ మధ్య అన్ని రొటీన్ సినిమాలు చేస్తున్నాడు.కాబట్టి ఈ సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అని ప్రతి ఒక్క అభిమాని కూడా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. నిజానికి చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో డేట్స్ కోసం చాలామంది అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు.

ఇక వశిష్ట లాంటి డైరెక్టర్ తో చిరంజీవి డైరెక్ట్ గా సినిమా చేస్తానని ఒప్పుకొవడం అనేది నిజంగా ఆయన గొప్పతనానికి నిదర్శనం అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించి మరోసారి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది.. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో బాలీవుడ్ నటుడు అయిన అక్షయ్ కుమార్ నటిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అయితే అక్షయ్ కుమార్ సినిమాలను చాలా తొందరగా ఫినిష్ చేస్తూ ఉంటాడు. ఆయన డిఫరెంట్ పాత్రలను చేస్తుంటాడు…

కాబట్టి చిరంజీవితో చేసే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో నటించి మెప్పించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. చూడాలి మరి ఈ సినిమా చిరంజీవికి అనుకున్న రేంజ్ లో సక్సెస్ ఇస్తుందా లేదా అనేది… ఈ సినిమాతో చిరంజీవి కూడా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ అయితే కొట్టబోతున్నాడు అనేది తెలుస్తుంది.ఇక చిరంజీవి భోళా శంకర్ ప్లాప్ తర్వాత వస్తున్న సినిమా కాబట్టి దీనిమీద చాలా కేర్ తీసుకుంటున్నట్టు గా తెలుస్తుంది…