https://oktelugu.com/

Ranveer Singh-Prasanth Varma: రణ్వీర్ సింగ్ ప్రశాంత్ వర్మ కాంబో లో వచ్చే సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి..?

Ranveer Singh-Prasanth Varma: గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం వీళ్ల గురించే మాట్లాడుతూ చర్చించుకుంటున్నారు.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేంతలా డిస్కషన్స్ చేసుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : May 30, 2024 / 05:45 PM IST

    Ranveer Singh Prasanth Varma Rakshas movie

    Follow us on

    Ranveer Singh-Prasanth Varma: బాలీవుడ్(Bollywood) ఇండస్ట్రీలో రణ్వీర్ సింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో వైవిధ్యమైన నటనను కనబరిచాడు. ఇక ఇప్పటికే సంజయ్ లీలా భన్సాలీ(Sanjay Leela Bhansali) డైరెక్షన్ లో చేసిన రామ్ లీలా, బాజీరావు మస్తానీ లాంటి సినిమాల్లో తన నటనను చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అయిపోతారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన తెలుగు యంగ్ డైరెక్టర్ అయిన ‘ప్రశాంత్ వర్మ’ రీసెంట్ గా ‘ హనుమాన్'(Hanuman) సినిమా తీసి ఒక సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

    ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతుంది అనే వార్తలైతే వచ్చాయి. గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా మొత్తం వీళ్ల గురించే మాట్లాడుతూ చర్చించుకుంటున్నారు.ఇక మొత్తానికైతే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేంతలా డిస్కషన్స్ చేసుకున్నారు. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా భారీ రికార్డులను కూడా బ్రేక్ చేస్తుందని అంత ఊహించుకున్నారు. ఇక ‘రణ్వీర్ సింగ్ ‘ అభిమానులైతే మా హీరో కి ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్ దక్కబోతుందనే ఊహాగానాలను కూడా వేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఏం జరిగిందో తెలియదు గానీ ఈ ప్రాజెక్టు అనేది ప్రస్తుతానికి వాయిదా పడినట్టుగా తెలుస్తుంది.

    Also Read: Malaika Arora: చెత్తను చేతులతో క్లీన్ చేసిన నటి.. వైరల్ పిక్స్

    200 కోట్ల బడ్జెట్ తో తీయాలి అనుకున్న ఈ సినిమా ప్రస్తుతం కొన్ని అనుకోని కారణాలవల్ల వాయిదా పడినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం మీద ప్రశాంత్ వర్మ స్పందిస్తూ “రణ్వీర్ సింగ్ చాలా మంచి నటుడు. ఆయన ఎనర్జీని అందుకోవడం ఎవరి వల్ల కాదు. అలాంటి హీరో తో సినిమా మిస్ చేసుకోవడం అనేది కొంతవరకు బాధ పెట్టే అంశమే అయినప్పటికీ అతనితో ఫ్యూచర్లో తప్పకుండా ఒక భారీ ప్రాజెక్టును చేస్తాను” అని తను ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.

    Also Read: Cannes Film Festival 2024: ‘ఫ్లీ మార్కెట్’ దుస్తులతోనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు అనసూయ.. అసలు ఏంటిది? దాని కథేంటి?

    ఇక ఇప్పుడు ఆయన మాటలు చర్చనీయాంశంగా మారినట్టుగా తెలుస్తుంది.అలాగే రణ్వీర్ సింగ్ కూడా స్పందిస్తూ ప్రస్తుతానికి మా ప్రాజెక్టు సెట్ అవ్వకపోయినా ఫ్యూచర్లో మేము కలిసి పని చేస్తాం అంటూ ఒక క్లారిటీ ఇచ్చాడు. ఇక వీళ్ళ క్లారిటీతో ఈ సినిమా ప్రస్తుతానికైతే ఆగిపోయింది అనే మాటలకు ఒక సమాధానం దొరికింది. మరి మళ్లీ ఫ్యూచర్ లో వీళ్ళ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…