CM KCR-Chinna Jeeyar: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అలకబూనారు. చినజీయర్ స్వామి ముచ్చింతల్ లోని తన ఆశ్రమంలో సమతామూర్తి విగ్రహావిష్కరణ శిలాఫలకం మీద తన పేరు చేర్చలేదనే కోపంతో జీయర్ స్వామితో సంబంధాలు తెంచుకున్నారు. దీంతో జీయర్ స్వామి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు. అదేదో అనుకోకుండా జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని చెబుతున్నారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది.
సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావడంతో సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు. దీంతో సమావేశానికి వచ్చే వారి పేర్లనే శిలాఫలకం మీద చెక్కించినట్లు చెబుతున్నారు. దీంతో అక్కడే పొరపాటు జరిగినట్లు భావిస్తున్నా కేసీఆర్ మాత్రం జీయర్ స్వామితో ఇక సంబంధాలు కొనసాగించరనే వాదన ప్రచారం జరుగుతోంది.
యాదాద్రి నిర్మాణంలో అన్ని దగ్గరుండి చూసుకున్న చిన్న జీయర్ స్వామిని ఇక ఆలయానికి రానివ్వరనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. దీంతో పేరు పెట్టలేదనే అక్కసుతోనే ఇవన్నీ చేస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సైతం రాజకీయాలే ప్రాధాన్యం వహిస్తున్నాయి. ఇక భవిష్యత్ లో ఇంకా ఎన్ని పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు.
Also Read: Chinajiyar KCR: కేసీఆర్ తో విభేదాలపై స్పందించిన చినజీయర్ స్వామి.. హాట్ కామెంట్స్
నాలుగేళ్ల క్రితమే ఈ కార్యక్రమానికి రూపకల్పన జరిగిందని చెబుతున్నారు. అప్పుడే ప్రధానమంత్రిని ఆహ్వానించామని చివరిక్షణంలో ఎవరెవరు పాల్గొంటున్నారో వారి పేర్లు చెక్కించామని అప్పుడే జరిగిన పొరపాటు వల్ల కేసీఆర్ పేరు చేర్చలేదని వివరణ ఇచ్చారు. దీంతో కేసీఆర్ మాత్రం శాంతించలేదని భావిస్తున్నారు. ఆయన కోసమే శాంతి హోమం శనివారానికి వాయిదా వేసినా ఆయన వస్తున్నట్లు సమాచారం లేకపోవడంతో ఇక ఆయన రారనే విషయం బోధపడుతోంది.
మొత్తానికి భక్తి కార్యక్రమంలో రాజకీయాలే ప్రధాన భూమిక పోషించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అదేదో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా పేరు చేర్చలేదని అలక బూనడం దేనికి సంకేతమనే వాదనలు కూడా వస్తున్నాయి. అదో ప్రైవేటు కార్యక్రమం పైగా భక్తికి సంబంధించింది అందులో కూడా పేరు లేదని ఇలా చేయడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి కార్యక్రమానికి కూడా ఇలా నిందలు వేయడం సముచితంగా లేదని పలువురు సూచిస్తున్నారు.
Also Read: Telangana CM KCR: మూడో కూటమి ఏర్పాటుతో కేసీఆర్ కల నెరవేరుతుందా?